‘ప్రజాపక్షం’ దినపత్రిక వార్షికోత్సవ సభలో మల్లేపల్లి లక్ష్మయ్య
ప్రజాపక్షం/హైదరాబాద్ “మార్కిజం, బుద్ధిజం, అంబేద్కరిజం ఒక్కటే. వీటి మధ్య తాత్వికపరమైన తేడా లేదు. ఈ మూ డింటి మధ్య ఎంతో అవగాహన కూడా కనిపిస్తుం ది. భారతదేశంలో కులరహిత సమాజ నిర్మాణం, పేదరికం నిర్మూలన పోరాటాల్లో ఈ అవగాహన ప్రజల్లో పెంపొందవలసిన అవసరం ఉంది” అని తెలంగాణ ప్రభుత్వ ‘బుద్ధవనం ప్రాజెక్టు’ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. “ప్రజాపక్షం” తెలుగు జాతీయ దినపత్రిక నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాగోల్ బండ్లగూలోని గిరిప్రసాద్ భవన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగినసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘ప్రజాపక్షం’ దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ‘మార్కిజం అనే అం శంపై లక్ష్మయ్య ప్రసంగించారు. మార్కిజం రెండింటి మధ్య కార్యక్రమాల ఆచరణలో తేడా తప్ప తాత్వికపరమైన తేడాలు లేవని ఆయన స్పష్టం చేశారు. బుద్ధుడి నుండి అంబేద్కర్ వరకూ ఆ తర్వాత ఈనాటి తరం వరకూ ఈ ఫిలాసఫీ ఒక ప్రవాహంలా కొనసాగుతోందన్నారు. అంబేద్కర్ కమ్యూనిజానికి వ్యతిరేకం కాదని అన్నారు. ఈ అంశాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉందన్నా రు. మార్కిజం మధ్య చాలా తేడా లు ఉన్నాయనడంలో కూడా నిజం లేదన్నారు. అంబేద్కర్ జీవితకాలంలో చాలా సందర్భాల్లో కమ్యూనిస్టు నాయకులను విమర్శించారే తప్ప, కమ్యూనిజం, మార్కిజం మౌలిక సిద్ధాంతాన్ని విమర్శించలేదని, ఈ అతి ముఖ్యమైన తేడాను అందరూ గుర్తించాలని చెప్పారు. కొంకణ్ ప్రాం తంలో అంబేద్కర్ మొదట భూమి సమస్యలపై కమ్యూనిస్టులతో కలిసి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మయ్య గుర్తు చేశారు. కమ్యూనిజం, బుద్ధిజం మధ్య ఉన్న కార్యాచరణ ఘర్షణను తాత్వికపరమైన పునాదికి ముడిపెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. కార్మికవర్గ నియంతృత్వాన్ని, హింసను బుద్ధిజం కార్యాచరణలో అంగీకరించదని, ఈ అంశాలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ మార్కిజం, బుద్ధిజం ఒక్కటేనన్నారు. సొంత ఆస్తి లేకపోవడం, సమాజంలో నిశ్చలంగా ఉండదని కచ్చితంగా మారుతూ వస్తుందన్న చలన సిద్ధాంతాన్ని చెప్పడంతోపాటు దోపిడీ,దుఃఖాలకు కారణం అసమానతలే అనే విషయంలో మార్కి జం, బుద్ధిజం మధ్య పూర్తి సారూప్యతలు ఉన్నాయన్నారు. ఈ సమాజాన్ని దేవుడు సృష్టించలేదని మార్క్ చెప్పిన గతితార్కిక భౌతికవాదం వివరించిందని, డార్విన్ కంటే 2,500 ఏళ్ళకు ముందుగానే బుద్ధుడు తన అష్టాంగమార్గంలో కూడా ఈ విషయాలే చెప్పడం ఎంతో ఆశ్చర్యకరమని అన్నా రు. మనిషి దుఃఖానికి కారణం పేదరికం, దోపిడీయేనని ఈ దుఃఖ నివారణకు మార్గం ఉందని బుద్ధుడు ఇద్దరూ చెప్పారని అన్నారు. శ్రమదోపిడీ చేయవద్దని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడని లక్ష్మయ్య గుర్తు చేశారు. రుగ్వేదంలోని పురుషసూక్తంలో చెప్పిన కులవ్యవస్థను బుద్ధుడు స్పష్టంగా వ్యతిరేకించాడని చెపారు. మార్కిజం వర్గపోరాటం గురించి చెప్పిందని, అంబేద్కర్ కూడా తన బ్రాహ్మిణిజం (ఆధిపత్యవాదం, దోపి డీ,అసమానతలు)లో ఈ విషయాలే చెప్పారన్నా రు. చైనాలో మావో నూతన ప్రజాస్వామ్య సోషలిస్టు వ్యవస్థ కావాలని కోరుకున్నారని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను అంబేద్కర్ కోరుకున్నారని అన్నారు. మావో సాంస్కృతిక విప్లవం ద్వారా మనిషి మానసిక స్థితి మార్చే ప్రయత్నం చేశారని, బుద్ధుడు కూడా మనిషి చైతన్యస్థితి మార్పు గురించి మాట్లాడారని, అంబేద్కర్ కూడా కులసమాజ నిర్మూలనకు మనిషిలో చైతన్యస్థితి మారాలని కోరుకున్నారని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ నినాదాలను తాను బుద్ధిజం నుండి తీసుకున్నానని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. దేశంలో కొనసాగిన అమానవీయత, అంటరానితనం, అసమానతలను వ్యతిరేకించిన అంబేద్కర్ భారతీయుల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం చాలా ఉందని ఉద్ఘాటించారని లక్ష్మయ్య గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రేమ పెంచుకున్న అంబేద్కర్ ఏనాడూ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని విమర్శించలేదన్నారు. భారతదేశంలో చారిత్రకంగా జరిగిన పోరాటాలు, జరిగిన మార్పులకు అనుగుణంగా దేశ పునర్నిర్మాణం జరగలేదని, అందువల్లనే ఈనాటికీ దేశంలో వ్యవస్థాగతమైన సమస్యలు వస్తున్నాయని అన్నారు. భారతదేశంలో మళ్ళీ కమ్యూనిస్టు ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని, అందులో అంబేద్కర్, బుద్ధుడు ఉండాలని, దేశంలో కులవ్యవస్థను, పేదరికాన్ని అర్థం చేసుకుని ఈ ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తన బాల్యంలో సమాజం దళితులపట్ల చూపించిన వివక్షను చవిచూసిన కుటుంబం నుండి తాను వచ్చానని, గ్రామంలో దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన తన పినతండ్రిని దొరలు కిరాతకంగా హతమార్చారని, ఆ ఘటనల స్ఫూర్తితోనే తాను ఈనాడు కులరహిత సమాజం కోసం జరుగుతున్న సామాజిక పోరాటం చేస్తున్నానన్నారు. ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేసిన బాల్యంనాటి తన అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ బుద్ధిజం ఆవిర్భావాల మధ్య 1500 ఏళ్ళు తేడా ఉన్నప్పటికీ వాటి మధ్య సారూప్యతలను, ఆచరణ ఆవశ్యకతను నేటి సమాజం తెలుసుకోవాలని చెప్పారు. కులాతీత వ్యవస్థ ఆవిష్కరణలో వీటి ప్రాధాన్యాలు గుర్తించాలన్నారు. మల్లేపల్లి లక్ష్మయ్యను సభకు పరిచయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో దళిత సబ్ ప్లాన్‌ను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా మాట్లాడుతూ ప్రజాపక్షం పత్రిక జాతీయ అంతర్జాతీయ, స్థానికాంశాలతో పాఠకులకు మంచి సమాచారం అందిస్తోందని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ జాతీయ సమితి తరపున అందరికీ అభినందనలు తెలియజేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాపక్షం పత్రిక అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే నిలదొక్కుకుని ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తోందని అభినందించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, దేశం నుండి వెళ్ళగొట్టబడిన బుద్ధిజం, ఈనాడు అంబేద్కరిజం, మార్కిజం దేశం నలుమూలలా వ్యాపించి ఉందని అన్నారు. బుద్ధుడు మధ్య ఉన్న చిన్న చిన్న ఆచరణ వైరుధ్యాలను అర్థం చేసుకోవాలన్నారు. తొలుత సభకు నవచేతన విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ ఎన్.మధుకర్ స్వాగతం పలుకగా, సిపిఐ జాతీయ సమితి సభ్యులు, నవచేతన విజ్ఞాన సమితి అధ్యక్షులు పల్లా వెంకట్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిర్దేశిత లక్ష్యాలతో పత్రిక ముందుకు పయనిస్తోందని పల్లా వెంకటరెడ్డి అన్నారు. నవచేతన విజ్ఞాన సమితి కార్యదర్శి బిఎస్‌ఆర్.మోహన్‌రెడ్డి, కోశాధికారి ఉజ్జిని రత్నాకర్‌రావు వేదికపై ఆశీనులయ్యారు. పలువురు సిపిఐ, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బుద్ధిజం-మార్కిజం-అంబేద్కరిజమే నేటి సమాజానికి శరణ్యం
RELATED ARTICLES