కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమం త్రి, సిపిఐ(ఎం) అగ్రనేతల్లో ఒకరైన బుద్ధదేవ్ భట్టాచార్య (76) తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొవిడ్ 19 టెస్టులో నెగిటివ్ వచ్చింది. పల్స్, బ్లడ్ ప్రెజర్ స్థిరంగానే వున్నాయి. కాకపోతే ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా తొలి మెడికల్ బులిటెన్ వెల్లడించింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వున్నారు. ఆర్‌టి పిసిఆర్, సిటిస్కాన్, సిసియు వంటి టెస్టులు నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొవిడ్ నెగిటివ్ రావడం శుభవార్త అని పేర్కొన్నాయి. 95 శాతం ఆక్సిజన్ శాచ్యురేషన్ చేయాల్సి వస్తున్నదని తెలిపా యి. ఇద్దరు సభ్యుల వైద్యుల బృందం నిత్య పర్యవేక్షణలో బుద్ధదేవ్ చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమించినప్పటికీ చికిత్సకు స్పందిస్తున్నారని మెడికల్ బులిటెన్ తెలిపింది. బుద్ధదేవ్ భట్టాచార్య 2000 – 2011 మధ్యకాలంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలనే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకున్నారు. వైద్య బృందానికి సహకరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సూర్‌జ్యా కాంతమిశ్రా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు.
గురుదాస్ దాస్ గుప్తా సతీమణి కన్నుమూత
సిపిఐ అగ్రగణ్యుల్లో ఒకరైన గురుదాస్ దాస్ గుప్తా సతీమణి జయా శ్రీ దాస్ మంగళవారం రాత్రి మరణించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1965లో గురుదాస్ దాస్ గుప్తాతో ఆమెకు వివాహమైంది. వారికి ఒక కుమార్తె ఉన్నారు. దాస్‌గుప్తా 2019 అక్టోబర్ 31న మరణించిన విషయం తెల్సిందే.
బుద్ధదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత
RELATED ARTICLES