న్యూఢిల్లీ : ప్రస్తుత, మాజీ ఎంపిలు, ఎంఎల్‌ఎలపై దాఖలైన కేసులు విచారణకు నోచుకోక పెండింగ్‌లో ఉన్నందున వాటిని విచారించేందుకు బీహా ర్, కేరళలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ కెఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించి ఈనెల 14లోపు నివేదికలు ఇవ్వాల ని పాట్నా, కేరళ హైకోర్టులకు సూచించింది. ప్రత్యేక కోర్టుల్లో ఉన్న కేసుల ను ఇప్పటికే ఏర్పాటు చేసిన జిల్లా న్యాయస్థానాలకు తిరిగి పంపించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎంపిలు, ఎంఎల్‌ఎల్‌పై దాఖలైన కేసులను విచారణ చేసేందుకు బీహార్, కేరళలోని జిల్లాల్లో అవసరమైన కో ర్టులను ఏర్పాటు చేసుకునేందుకు సుప్రీం ప్రత్యేక కోర్టు లు ప్రజాప్రతినిధిలపై ఉన్న కేసులను విచారిస్తూనే ప్రాధాన్యతను బట్టి జీవి త కాల కేసులను కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా, క్రి మినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషే ధం విధించాలని కోరుతూ న్యాయవాది, బిజెపినేత అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ఇదిలా ఉండగా, 4122 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సోమవారం సుప్రీం విష యం తెలిసిందే. అందులో ప్రస్తుత, మాజీ పార్లమెంట్, శాసనసభ్యులపై దాఖలైన కొన్ని కేసులు మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి.
బీహార్, కేరళలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి : సుప్రీం
RELATED ARTICLES