మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాపక్షం / హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానున్న 119 కొత్త బిసి గురుకుల పాఠశాలలకు 3,689 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను ప్రభుత్వం మం జూరు చేసింది. వీటితో పాటు 595 పోస్టులు పోరుగు సేవల విధానంలో మంజూరయ్యాయి. మహాత్మా జోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కార్యాలయానికి 28 పోస్టులు మంజూరు చేశారు. మరో 10 పోస్టులను పోరుగు సేవల విధానంలో మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కె. రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను 2019 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ళలో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతించింది. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టుల్లో 1,071 టిజిలి పోస్టు లు, 833 జెఎఎల్, 833 పిజిటి, 119 ప్రిన్స్‌పాల్ పోస్టులు ఉన్నాయి. 119 ఫిజికల్ డైరెక్టర్, 119 పిఇటి, 119 లైబ్రేరియన్, 119 క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, 119 పోస్టుల చొప్పున స్టాఫ్ నర్స్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ రెగ్యులర్ పో స్టుల్లో 2019 సంవత్సరంలో 1,904, 2020 833 పోస్టులు, 2021 119 పోస్టులు, 2022 సంవత్సరంలో 833 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్న 595 పోస్టుల్లో ఐసిటి ఇన్‌స్ట్రక్టర్ 238, ల్యాబ్ అటెండర్ 238, ఆఫీస్ సబార్డినేట్ 119 పోస్టులు ఉన్నాయి. గురుకుల సంస్థ కేంద్ర కార్యాలయానికి మంజూరు చేసిన 28 రెగ్యులర్ పోస్టులు, 10 ఔట్ సోర్సింగ్ పోస్టులు 2019 సంవత్సరంలో భర్తీ చేయడానికి అనుమతించారు.