జయశంకర్ జిల్లాలో దారుణం
స్మార్ట్‌కేర్ హస్పిటల్ ను సీజ్ చేయాలని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్
నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
ప్రజాపక్షం /జయశంకర్ భూపాలపల్లి వైద్యానికి అయిన బిల్లు కట్టలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్‌లో ఉన్న స్మార్ట్‌కేర్ ఆసుపత్రిలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూ పాలపల్లి మండలం మహబూబ్‌పల్లికి చెందిన మర్రిబాబు (50)కి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఘనపురం మండలం చెల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కాకాతీయ థర్మల్ పవర్ ప్రా జెక్టు నిర్మాణంలో ఆ భూమిని కోల్పోయాడు. అప్పటి ముఖ్యమంత్రి భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హమీ ఇవ్వగా, ఇప్పటి వరకు తనకుగానీ, తన కొడుకుగానీ కెటిపిపిలో ఉద్యోగం లభించలేదు. దీంతో ఈ నెల 1న కెటిపిపి ప్రధాన గేట్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అడ్డుకుని జిల్లా కేంద్రంలోని స్మార్ట్ కేర్ ఆసుపత్రికి తరలించారు. గత 10 రోజులుగా మర్రిబాబు చికిత్స పొంద గా, ఆసుపత్రి బిల్లు రూ. 60,000 వేలు అయిం ది. కాగా, డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్న మర్రిబాబు ఆసుపత్రిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మర్రిబాబును ఆసుపత్రి సిబ్బంది బబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవవడంలో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ స్మార్ట్‌కేర్ ఆసుపత్రి ఎదుట సిపిఐ, జనసేన, ఎమ్మార్పీస్ నాయకులు సొతుకు ప్రవీణ్, క్యాతరాజ్ సతీష్, జెర్రి పోతుల సనత్ కుమార్ ధర్నాకు దిగారు. అసుపత్రి లైసెన్స్ రద్దు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్‌లు అక్కడి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బిల్లు కట్టలేక ఆసుపత్రిలోనే ఆత్మహత్య
RELATED ARTICLES