సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : వ్యవసాయరంగంలో సంస్కరణల పేరుతో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చే చట్టాల ద్వారా రైతులకు, సామాన్య ప్రజలకు శాపం గా మారనున్నదని శనివారం విడుదల చేసిన ఒక ప్రతికా ప్రకటనలో విమర్శించారు. పార్లమెంటులో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్‌ఎస్ ఎంపిలను ముఖ్యమంత్రి ఆదేశించడం పట్ల చాడ వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేసే ఆందోళనకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న అకాలీదళ్ తరుపు కేంద్ర మంత్రి హర్‌సిమ్రన్‌జిత్ కౌర్ ఈ బిల్లులకు వ్యతిరేకింగా రాజీనామా చేయడాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్రమోడీ చిలక పలుకులు పలుకుతూనే దేశానికి అన్నం పట్టే రైతన్న ఉనికికే ప్రమాదం తీసుకొచ్చారని మండిపడ్డారు.
బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలె
RELATED ARTICLES