న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఎన్నికల మ్యా నిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ‘వంచన పత్రం’(ఝాన్స పత్ర), ‘అబద్ధాల నీటిబుడగ’ అని విమర్శించింది. మ్యానిఫెస్టో అని చెప్పుకోడానికి బదులు వారు ‘మాఫీనామా’ జారీచేశామని చెప్పి ఉంటే బాగుండేదని తెలిపింది. ‘ప్రజలు అధికారం కట్టబెడితే న్యాయం చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బిజెపి మ్యానిఫెస్టో ‘న్యాయానికి విరుద్ధంగా అబద్ధాలు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటే ల్ పేర్కొన్నారు. బిజెపి 2014లో చేసిన ఎన్నికల వాగ్దానాల వైఫల్యంపై కాంగ్రెస్ 125 ప్రశ్నలను కూడా విడుదలచేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ముఖచిత్రంపై ‘ప్రజలు’ ఉంటే, బిజెపి మ్యానిఫెస్టో ముఖచిత్రంపై ‘ప్రధాని నరేం ద్ర మోడీ’ ఉన్నారని అహ్మద్ పటేల్ ఎత్తిచూపారు. మో డీ, బిజెపి ఎత్తులు,జిత్తులు వేస్తారని, ఛాయ్‌వాలా, చౌకీదార్ వంటి పదబంధాలు వాడుతుంటారని కూడా ఆయ న చెప్పారు. వారిని దేశ ప్రజలు బాగా అర్థంచేసుకున్నారన్నారు. ‘మీరు ప్రజలను కొన్ని సందర్భాల్లోనే వంచించగలరు కానీ ఎల్లకాలం వంచించలేరు’ అన్నారు. కాంగ్రె స్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా ప్రధానిని విమర్శించారు. ‘మోడీ పయనం శుష్క వాగ్దానాలు, వం చనలతో కూడుకున్నది’ అని మనం చూశామన్నారు. అధికారంలోకి మోడీజీ రాకముందు చేసిన 125 వాగ్దానాల గురించి దేశప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ‘గత ఐదేళ్లలో ఈ ప్రభుత్వం సాధించింది, సాధించలేనిదేమిటో త్వరలో స్పష్టం కాగలదు’ అని కాంగ్రెస్ ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ గౌడ చెప్పారు. ‘సంకల్పిత్ భా రత్, సశక్త్ భారత్’ పేరిట 45 పేజీల బిజెపి మ్యానిఫెస్టో ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు.
కొత్త శుష్క వాగ్దానాల జాబితా: సిపిఐ
బిజెపి మ్యానిఫె స్టో గత ఐదేళ్లలో హామీలు నెరవేర్చక వంచించిన దానిని దాచే కొత్త శుష్క వాగ్దానాల జాబితా అని భారత కమ్యూనిస్టు పార్టీ సోమవారం అన్నది. ‘బిజెపి మ్యానిఫెస్టో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమైన విభజించు, మతతత్వ, దురభిమా న, ఫాసిస్టు భావజాలానికి సంబంధించిన రాజకీయ పరికరం తప్ప మరోటి కాదు’ అని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా చెప్పారు. ‘బిజెపి వన్నీ జిమిక్కులు.. బిజెపి కా స్తా భారతీయ జుమ్లా(శుష్కవాగ్దానాల) పార్టీ అయింది’ అని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ‘ప్రతి పౌరుడి బ్యాం కు ఖాతాలో రూ. 15 లక్షలు జమా చేస్తానన్న బిజెపి వాగ్దానం , అచ్చేదిన్, 2కోట్ల ఉద్యోగాల హామీ ఏమయ్యా యి?’ అని ఆయన ప్రశ్నించారు. బిజెపి మ్యానిఫెస్టో ఉద్యో గకల్పన గురించి ప్రస్తావించనే లేదన్నారు.
మతతత్వాన్ని ప్రభావితం చేయగలదు: ఏచూరి
బిజెపి తన మ్యానిఫెస్టోలో రామ మందిర నిర్మాణం గురించి చెప్పడం తమకేమి ఆశ్చర్యం కలిగించలేదని, కాషాయ పార్టీ గత 30 ఏళ్లుగా దీనిని వాడుతూనే ఉందని, ఇది మతతత్వాన్ని ప్రభావితం చేయగలదని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ వారు రామ మందిర నిర్మాణం వాదనను చేస్తూ వచ్చారన్నారు. హిందుత్వ ఓట్లను పొందడానికే వారలా చేస్తున్నారన్నారు. కానీ ఈసారి అది జరగదని చెప్పారు.
బిజెపి మ్యానిఫెస్టో ‘వంచన పత్రం’: కాంగ్రెస్
RELATED ARTICLES