అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ఫలితాలపై బిజెపి కేంద్ర నాయకత్వం స్కానింగ్
ఓట్ల శాతం పెరిగితే సీట్లు ఎందుకు పెరగలేదు
టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటున్నారు… తగిన ఫలితాలేమో కనబడటం లేదు
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ప్రాంతాల్లో అభ్యర్థులు గెలిస్తే సొంత పార్టీ బలమేది?
చేరికలు పార్టీకి నష్టం చేస్తున్నాయా? లాభం చేస్తున్నాయా?
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బిజెపి బలం పెరిగిందా? తగ్గిందా? అనే అంశంపై పార్టీ కేంద్ర నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. అధికార టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నా యం అని పదే పదే ప్రకటిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ మేరకు ఎన్నికల్లో విజయం సాధించకపోవడం పట్ల కేంద్ర నాయకత్వం ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క ఎంఎల్‌ఎ మాత్రమే గెలవడంతో ఖంగుతిన్న బిజెపి ఇక్కడి పరిస్థితిపై దృష్టి సారించడంతో ప్రధాని మోడీ చరిష్మాతో నాలుగు ఎంపి సీట్లు గెలవడంతో పార్టీ కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర బిజెపి నాయకత్వం ముందుకు వెళ్లినప్పటికీ అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికలు, జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర నేతలు ప్రకటించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రతి ఎన్నికల్లో పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదికలు పంపుతుంది. అయితే ఆ మేరకు సీట్లు ఎందుకు పెరగడం లేదనేది బిజెపి నాయకత్వం తేల్చుకోలేకపోతున్నది.ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఓట్ల శాతం పెరిగినా ఆ మేరకు సీట్లు పెరగకపోవడం పట్ల ఆరా తీస్తుంది. గతంలో రాష్ట్రంలో పార్టీ పెద్దగా లేకపోయినప్పటికీ ఐదుగురు ఎంఎల్‌ఎలు గెలవగా గత ఆరేళ్లుగా పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ అనంతరం జరుగుతున్న ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోతుండ డం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీల నుంచి పెద్ద సం ఖ్యలో ప్రముఖులు, పెద్ద నేతలు, కార్యకర్తలు పార్టీ లో చేరుతున్నప్పటికీ ఆ మేరకు ఎన్నికల్లో ఫలితాలు కనబడడం లేదని కేంద్రన నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. అసలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకులు, కార్యకర్తలతో బిజెపికి లాభం జరుగుతున్నదా? నష్టం జరుగుతున్నదా? అని పరిశీలిస్తున్నది.
కొత్తగా వచ్చిన నేతల ప్రాంతాల్లోనే..
తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సంఖ్యలో వార్డులు, డివిజన్లను గెలుచుకుందని రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదించింది.అయితే అం దులో ఎక్కువ శాతం ఇటీవల బిజెపిలో చేరిన డి.కె.అరుణ, జితేందర్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, గరికపాటి రామ్మెహన్ తదితర ప్రముఖుల ప్రాంతాలలోనే ఉండడం కేంద్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా తమ అనుచరులను తాము గెలిపించుకున్నామని వారు కూడా ప్రకటిస్తున్నారు. ఎక్కువ మంది అక్కడే గెలిస్తే అప్పటికే పార్టీకి ఉన్న నేతల ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నది. అక్కడ పార్టీ మెరుగుపడిందా? బలహీనపడిందా, ఆ ప్రాంతాల్లో ఆశించిన వార్డులు, డివిజన్లలో ఎందుకు గెలవలేకపోయిందని నాయకత్వం స్కానింగ్ చేస్తోం ది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు రావడం సహజమేనని, ఎక్కువ మంది పోటీలో ఉంటున్నా తక్కువ సంఖ్యలో ఎందుకు గెలుస్తున్నారని పార్టీ కేంద్ర నాయకత్వం పదే పదే ప్రశ్నిస్తున్నా రాష్ట్ర నాయకుల నుంచి సరైన సమాధానం రావడం లేదని, ఎప్పటికప్పుడు సందోర్భోచిత కారణాలను చెబుతున్నదని బిజెపి జాతీయ నాయకుడోకరు రాష్ట్ర నాయకునితో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వివిధ పార్టీల నుంచి చాలా మంది చేరితేనే పరిస్థితి ఇలా ఉంటే, వారు చేరకపోతే పరిస్థితి ఏమిటి? పార్టీ ఇంకా బలహీనపడేదా? చేరికలు పార్టీకి నష్టం చేశా యి? అనే కోణాల్లో కూడి బిజెపి కేంద్ర నాయక త్వం ఆలోచిస్తున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పైగా మున్నిపల్ ఎన్నికల్లో బిజెపి ఆశించిన మేరకు నామినేషన్లు దాఖలు చేయలేకపోవడం, వేసిన చోట ఫలితాలను సాధించలేకపోవడంతో బిజెపిలో చేరిన వివిధ పార్టీలకు చెందిన కొంత మంది నాయకులు కూడా అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. ప్రతి ఎన్నికల్లో ఓడిన అనంతరం వచ్చే ఎన్నికలే తమ లక్ష్యమని ప్రకటిస్తున్నది.తాజాగా మున్సిపల్ ఎన్ని కల అనంతరం రాష్ట్రంలో మూడవ వంతు జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. ఇక ఆ ఎన్నికల్లో బిజెపి ఏ మేరకు ఫలితాలను సాధిస్తుందనేది పార్టీలో చర్చగా మారింది.
బిజెపి బలం పెరిగిందా? తగ్గిందా?
RELATED ARTICLES