3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన సోనియాగాంధీ
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలకు అభినందనలు
న్యూఢిల్లీ: హిందీ ప్రభావిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కారణం బిజెపి అనుసరించిన ప్రతికూల రాజకీయాలేనని యూపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ అన్నారు. బుధవారం ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓటమి పాలవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో బిజెపి అనుసరించిన ప్రతికూల రాజకీయాల వల్లే ఆ పార్టీ దారుణంగా ఓట మి పాలైదంన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు సోనియాగాంధీ అభినందనలు తెలిపారు. అలాగే కొంత మందికి ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్లు ఇవ్వలేకపోయామని.. అలాంటి వారు తిరిగి సొంత గూటికి వస్తారని భావిస్తు న్నట్లు పేర్కొన్నారు.