కాంగ్రెస్ యాత్రకు వస్తున్న స్పందనను చూసి విస్తున్న పోతున్న కాషాయ పార్టీ : జైరామ్ రమేష్
న్యూఢిల్లీ : ‘భారత్ జోడో యాత్ర’కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి విస్తుపోయిన బిజెపి ‘అబద్ధాల ఫ్యాక్టరీ’ ఓవర్‌టైమ్ పనిచేస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. అధికార పార్టీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తే తాము కూడా అంతకు రెట్టింపు దూకుడుతో స్పందిస్తామని పేర్కొంది. సోమవారం ఎఐసిసి ప్రధా న కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారక చిహ్నం వద్ద రాహుల్‌గాంధీ నివాళి అర్పించాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై జైరామ్ మండిపడ్డారు. కేంద్రమంత్రికి కొత్త కండ్ల జోడు అవసరమైతే అందిస్తామని ఎద్దేవా చేశారు. అదే విధంగా ‘భారత్ జోడో యాత్ర’ కు ముందు వివేకానంద స్మారక చిహ్నాన్ని రాహుల్ సందర్శించడంపై స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌పై పవన్ ఖేరా, మాణిక్కం ఠాకూర్ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. దేశంలో ద్వేషం, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వారు కొన్ని విషయాలను తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంతోపాటు ప్రజలను ఏకం చేయడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ‘దేశాన్ని విభజించే ప్రయత్నాలను, మతం, భాష, కులం, రాష్ట్రాల పేరుతో విభజన విధానాలు, విభజన ఉద్దేశాలను అడ్డుకోవడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం. మోడీ ప్రభుత్వ విధానా ల వల్ల అసమానతలు పెరిగిపోతున్న తీరుపై పోరాడడం. రాజకీయ కేంద్రీకరణను పెం పొందించడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం” అని ఆయన అన్నారు. వివేకానంద రాక్ మెమోరియల్వ ద్ద గాంధీ నివాళులు అర్పించాలని ఇరానీ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలకు రమేష్ స్పందిస్తూ ఆమెకు కుంభకోణంతో సంబంధం ఉండడం వల్ల నిజాలు మాట్లాడుతుంటే నమ్మడం లేదన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ ఎక్కడున్నారో చెప్పామని, ఆమె సమాధానం చెప్పాలని, ఆమెకు కొత్త కండ్ల జోడు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఐదు రోజుల్లో ‘కన్యాకుమారి టు కాశ్మీర్’ యాత్ర సోమవారం సాయంత్రానికి మొత్తం 102 కిలోమీటర్లు పూర్తయిందని రమేష్ తెలిపారు. భారత్ జోడో యాత్ర బిజెపికి ఆందోళన కలిగించే అంశంగా మారిందని అన్నారు. ‘భారత్ జోడో యాత్ర’కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి బిజెఫిపి సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు.
బిజెపి ‘అబద్ధాల ఫ్యాక్టరీ’ అతిగా పనిచేస్తోంది!
RELATED ARTICLES