HomeNewsBreaking Newsబిజెపిని గెలిపించేందుకుబిఆర్‌ఎస్‌ కుట్ర

బిజెపిని గెలిపించేందుకుబిఆర్‌ఎస్‌ కుట్ర

లిక్కర్‌ కేసులో ఎంఎల్‌సి కవితను అరెస్టు చేస్తారనే భయంతోనే కాషాయపార్టీకి అనుకూలంగా మారిన కెసిఆర్‌
‘ఇండియా’ కూటమిని తట్టుకోలేమనే జమిలి ఎన్నికలకు యత్నం
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ విమర్శ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాబోయే రోజుల్లో “ఇండియా కూటమి”ని తట్టుకోలేమనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముందస్తుగా జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. ముంబయిలోని ‘ఇండియా కూటమి’ సమావేశం ప్రభావంతోనే ‘ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని ’ ఏర్పాటు చేశారన్నారు. మూడో ఫ్రంట్‌ పేరుతో బిఆర్‌ఎస్‌, ఎంఐఎం జాతీయ స్థాయిలో మరోసారి బిజెపిని గెలిపించేందుకు కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతోనే బిజెపికి కెసిఆర్‌ అనుకూలంగా మారారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెండానే మార్చుకోలేని వారు,ఇక భారతదేశ రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారని బిజెపిని నిలదీశారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నర్సింహతో కలిసి హైదరాబాద్‌లోని మగ్దుం భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ముంబయిలో జరిగిన ఇండియా సమావేశంతోనే బిజెపి భయడిందని, మోడీ, అమిత్‌షాలు ఎంత ఎత్తునప్పటికీ, వారి గుండె ఎలుక తరహా చిన్న గా ఉంటుందన్నారు. జమిలీ ఎన్నికల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఒక బోగస్‌ అని మండిపడ్డారు. ఈ కమిటీలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏది చెబితే అదే చేస్తారని, సంతకాలు పెట్టాలంటే పెడుతారని, కమిటీలోని మిగతా స భ్యులు నోరు తెరిచే పరిస్థితులు ఉండబోవన్నారు. అలాంటి కమిటీకి దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ సహాయ నిరాకరణ చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కోవింద్‌కు కనీస విజ్ఞత ఉంటే అవమానకరమైన ఈ కమిటీకి నాయకత్వ బాధ్యతను తిరస్కరించాలని సూచించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో న్యాయ వ్యవస్థ నుండి మొదలు అన్ని వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలకు పార్లమెంట్‌, ఇతర అసెంబ్లీలో 2/3 వంతు మద్దతు ఉండాలని, కానీ అధికారంలో ఉన్న బిజెపి ఇందుకు భిన్నంగా వ్యవహారిస్తోందని, జమిలి ఎన్నికల అంశంపై కనీసం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపికి డౌన్‌ ఫాలైందని, మళ్లీ బతికేందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. జమిలి ఎన్నికల అంశంలో బిఆర్‌ఎస్‌, వైసిసి, టిడిపి ఖండించకపోతే ఆ పార్టీలు సానుకూలంగా ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. మణిపూర్‌ మంటలను కేంద్రంలోని బిజెపి ప్రొత్సహిస్తోందని, అక్కడి సిఎం ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇస్రో ప్రయత్నాలను కూడా ప్రధాని మోడీ మతం రంగు పులమాలని చూస్తున్నారన్నారు. ఆదిత్య ఎల్‌ 1 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.
బిజెపికి సేవ చేసేందుకే పుట్టిన ఎంఐఎం
బిజెపికి సేవ చేసేందుకే పుట్టిన పార్టీ ఎంఐఎం అని, బిజెపి, ఎంఐఎం ‘లివింగ్‌ టు గేదర్‌’ అని నారాయణ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసే నాటకాలు ఆడుతున్నాయని, బిజెపిని గెలిపించేందుకే ఎంఐఎం పావులు కదుపుతోందని, తాజాగా కెసిఆర్‌ కూడా వారి భూజం ఎక్కారని చెప్పారు. ఎంఐఎంపైన సిబిఐ దాడులు నిర్వహిస్తే అనేక కోట్ల రూపాయాలు వెలుగులోనికి వస్తాయని, బిజెపి, ఎంఐఎం కలిసి లేకపోతే ఎంఐఎంపైన సిబిఐ దాడులు చేయించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. వై.ఎస్‌. జగన్‌ తన కేసుల నుండి తప్పించుకునేందుకు బిజెపికి మద్దతు పలుకుతున్నారని,

కుమార్తెను రక్షించుకునేందుకే బిజెపికి అనుకూలంగా కెసిఆర్‌
లిక్కర్‌ కేసులో తన కుమార్తెను రక్షించుకునేందుకు బిజెపికి కెసిఆర్‌ అనుకూలంగా మారారని నారాయణ విమర్శించారు. తెలుగు రాష్ట్రాలలో కనీసం కామన్‌సెన్స్‌ ఉన్నవారెవ్వరైనా బిజెపికి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీలను బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదని నిలదీశారు. కేంద్రం నుండి మొట్టికాయలు వేసి, ఇలాగే ప్రవర్తిస్తే కూతురు జైలుకు వెళ్తుందని బెదిరించినందుకే గవర్నర్‌కు కెసిఆర్‌ రెడ్‌ కార్పెట్‌ వేశారన్నారు. రాబోయే ఐదు రాష్ట్రా ల ఎన్నికల అంశంపైన తమ పార్టీలో చర్చించబోతున్నామన్నారు. కెసిఆర్‌ బిజెపికి అనుకూలంగా మారిన తర్వాత బిఆర్‌ఎస్‌ సీట్ల సర్దుబాటులో భాగంగా వారి ప్రతిపాదనలను తాము పట్టించుకోలేదని నారాయణ స్పష్టం చేశారు. బిజెపి వైఖరి పట్ల కెసిఆర్‌ తన నాబి నుండి కాకుండా నాలుకతో మాట్లాడుతున్నారన్నారు. బిజెపికి అనుకూలంగా మారడంతోనే తాము బిఆర్‌ఎస్‌కు దూరమయ్యామననారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments