HomeNewsAndhra pradeshబిజెపితో జనసేన దోస్తీ

బిజెపితో జనసేన దోస్తీ

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల
2024లో వచ్చేది మా ప్రభుత్వమే
రాజధాని తరలిస్తే చూస్తూ ఊరుకోం: పవన్‌
బిజెపి, జనసేనతోనే సామాజిక న్యాయం సాధ్యం: కన్నా

ప్రజాపక్షం/విజయవాడ; ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బిజెపితో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అంశంపై బిజెపి పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. గురువారం విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ బిజెపి నేతలతో కీలక భేటీ జరిగింది. అనంతరం జనసేన, బిజెపి నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాతూ బిజెపితో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం.. అంతకుముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలన. ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. దాన్నే బిజెపి, అందించబోతున్నాయి. ఈ కలయికకు అండగా నిలబడిన ప్రధాని మోడీ, అమిత్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. ఎపిలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చాం. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపితో కలిసే వెళ్తాం పవన్‌ వివరించారు. రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇప్పుడు ఏకపక్షంగా తరలిస్తారని అనుకోను. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తాం. అంతపెద్ద రాజధా ని సాధ్యం కాదని అప్పుడే చెప్పా. 33వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయి.. రైతులు రోడ్డున పడ్డారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడమే కాదు.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. అమరావతిని తరలిస్తే చూస్తూ కూర్చోము.. తెగించే నాయకత్వం ఉంది మూడు రాజధానులు అనడం ప్రజలను మభ్యపెట్టడమే. హైకోర్టు పెడితే దాన్ని రాజధాని అనరు. హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి బాధ్యత వహించాలి. అప్పట్లో వాళ్లు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకపోతే బాగుండేది. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి 22 మంది ఎంపిలున్న వైసిపినే అడగాలి పవన్‌ వ్యాఖ్యానించారు. భారతంగా ఉన్న మనదేశం నుంచి పాకిస్థాన్‌ పాక్‌ ఇస్లాం దేశంగా చెప్పుకుంటున్నా.. మన దేశాన్ని హిందూ దేశంగా చెప్పలేదు. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల్లో వెనుకబడిన వర్గాలు, దళితులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడి ముస్లింలకు పౌరసత్వం రద్దు చేస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం.. మన దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ లేదు చెప్పారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments