ముంబయి: బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన ముం బయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో గురువారం మరణించారు. కేన్సర్‌తో పాటు శ్వాస కోస సమస్య కూడా బాధించడంతో రిషి కపూర్‌ను ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 8:45 నిమిషాలకు రిషీ కపూర్ తుదిశ్వాస విడిచారు. చివరి నిమిషం వరకు రిషీ నవ్వుతూ, నవ్విస్తూ గడిపారని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషి భారత్‌కు తిరిగి వచ్చారు.
చందన్‌వాడి శ్మశాన వాటికలో అంత్యక్రియలు
రిషికపూర్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబయి చందన్‌వాడి శ్మశాన వాటికలో ముగిశాయి. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే అంత్యక్రియలు ముగించాలని పోలీసులు సూచించడంతో ఢిల్లీ నుంచి బయలుదేరిన రిషి కుమార్తె రిధిమా కపూర్ రాకముందే అంత్యక్రియలు ముగిశాయి. నిబంధనల ప్రకారం కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రిషి అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు రణబీర్‌కపూర్, భార్య నీతూకపూర్, సోదరి రీమా జైన్, మనోజ్ జైన్, ఆర్మాన్, నటులు సైఫ్ అలీఖాన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, అలియాభట్, అనిల్ అంబానీ, ఆయాన్ ముఖర్జీ వంటి కొద్దిమందిని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించారు.
ప్రముఖుల సంతాపం : మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రిషికపూర్ ఆకస్మిక మరణం షాక్‌కు గురిచేసిందని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ఎల్లప్పుడూ నవ్వు ముఖంతో ఉండే ఎవర్ గ్రీన్ స్టార్ హీరో ఇక లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. సినీ రంగానికి తీరని లోటన్నారు. రిషికపూర్ ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానంటూ ట్విటర్ ద్వారా సందేశం పో స్ట్ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రిషికపూర్ టాలెంట్‌లో పవర్‌హౌస్‌లా ఉండేవారని ట్విటర్ వేదికగా మోడీ కితాబునిచ్చారు. సోషల్ మీడియాతో సహా రిషికపూర్‌తో జరిగిన సంభాషణలను గుర్తు చేశారు. సినీ రంగంతో పాటు దేశాభివృద్ధికి సంబంధించి ఆయనకు తపన ఎక్కువగా ఉండేదన్నారు. రిషికపూర్ మరణం తనను కలచివేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన వ్యక్తి కాదు వ్యవస్థ అని చెప్పారు. భారతీయ సినీ రంగానికి తీరని లోటని ట్విటర్ వేదికగా తెలిపారు. నటన పరంగా ఆయన ఎప్పటికీ గుర్తుంటారని చెప్పారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడురిషి కపూర్ కన్నుమూత
RELATED ARTICLES