సిబిఎస్‌ఇ క్లాస్-12 ఫలితాలు విడుదల
95% మార్కులతో 70 వేల మంది పాస్
న్యూఢిల్లీ: సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాల్లో బాలికలు ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. శుక్రవారం ఫలితాలు వెలువడగా, ఈ ఏడాది 70,000 మంది విద్యార్థులు కనీసం 95 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టు సిబిఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలిపింది. మరో లక్షన్నర మందికి 90 శాతం మార్కులు వచ్చినట్టు పేర్కొంది. బాలుర కంటే బాలికలే ఫలితాల్లో ముందంజలో నిలిచారని వివరించింది. కరోనాఉధృతి కారణంగా సిబిఎస్‌ఇ పరీక్షలను వాయిదావేసిన విషయం తెలిసిందే. దీనితో ఫలితాలను తేల్చడానికి ప్రత్యామ్నాయ మర్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులను ఖరారు చేయాలని తీర్మానించి, అదే క్రమంలో ఫలితాలను ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు ఈనెలాఖరులోగా ఫలితాలను ప్రకటించాలని సిబిఎస్‌ఇని ఆదేశించింది. ఫలితంగా గ్రేడ్లను ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కుల ద్వారా నిర్ధారించిన సిబిఎస్‌ఇ ఫలితాలను వెల్లడించింది. అయితే, మరో 65,000 మంది విద్యార్థుల ఫలితాలను వెల్లడిం చేయాల్సి ఉంది. వీరికి గ్రేడ్లను నిర్ణయించకపోవడంతో, ఆగస్టు 5న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపింది.
బాలికలే టాప్
RELATED ARTICLES