98.20 శాతంతో తిరువనంతపురం ప్రథమస్థానం
సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: గురువారం వెలువడిన సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలలో 88.70 శాతం, బాలురు 79.40 శాతం, ట్రాన్స్‌జండర్స్ 83.3శాతం ఉత్తీర్ణత సాధించారని సిబిఎస్‌ఇ బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. ఢిల్లీ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం గత సంవత్సరం కంటె పెరిగిందని తెలిపారు. మొత్తం 12.05లక్షల మంది పరీక్షలకు హాజరవగా, గతం కంటే 0.39 శాతం ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. తిరువనంతపురం 98.20 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, చెన్నై 92.93 శాతం, ఢిల్లీ 91.87 శాతంగా తరువాతి స్థానాలలో నిలిచాయన్నారు. సిబిఎస్‌ఇ అనుంబంధంగా ఉన్న విదేశీ పాఠశాలల ఉత్తీర్ణతా శాతం 94.94 నుండి 95.43 శాతానికి పెరిగినట్లు చెప్పారు. గత సంవత్సరంకంటే ముందుగా ఫిబ్రవరి 16 న పరీక్షలు మొదలైనాయని, మే మూడవ వారంలో ఫలితాలు ప్రకటించాల్సి ఉండగా ఈసారి రెండవ వారంలోనే ఫలితాలు విడుదలయ్యాయన్నారు.