రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు విడుదల
ఇంజినీరింగ్‌లో 80.33 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86.34 శాతం ఉత్తీర్ణత
గతేడాదితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత శాతం
ఇంజినీరింగ్‌లో 82 అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 87 శాతం ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిలు
ప్రజాపక్షం/ హైదరాబాద్ ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్ ఫలితాల తరహాలోనే గురువారం విడుదలైన టిఎస్ ఎంసెట్ ఫలితాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 82 శాతం ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో అబ్బాయిలు 84 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన టిఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం ఉదయం విడుదల చేశారు. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 80.33 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. 2022 ఫలితాలను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్ విభాగంలో 80.41 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 87 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కలిసిన మూడు మార్కులు
మ్యాథమెటిక్స్ ప్రశ్నపత్రం రూపొందించిన సమయంలోనే మూడు ప్రశ్నల విషయంలో తప్పిదం జరిగిందని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నిర్ణయం మేరకు ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు తప్పుడు ప్రశ్నలకు గానూ మూడు మార్కుల చొప్పున కలిపారు. తొలి, రెండు, మూడు, నాలుగో సెషన్స్‌కు హాజరైన విద్యార్థులకు ఎలాంటి మార్కులు కలపలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని సూచించారు.
అగ్రికల్చర్, మెడికల్ టాప్ టెన్ ర్యాంకర్లు..
ఫస్ట్ ర్యాంకు బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్(ఈస్ట్ గోదావరి)
రెండో ర్యాంకు – నశిక వెంకట తేజ(చీరాల)
మూడో ర్యాంకు – సఫల్ లక్ష్మీ పసుపులేటి(రంగారెడ్డి)
నాలుగో ర్యాంకు దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి(గుంటూరు)
ఐదో ర్యాంకు బోర వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)
ఆరో ర్యాంకు దేవగుడి గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)
ఏడో ర్యాంకు – వంగీపురం హర్షిల్ సాయి(నెల్లూరు)
ఎనిమిదో ర్యాంకు దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు)
తొమ్మిదో ర్యాంకు గంధమనేని గిరి వర్షిత(అనంతపురం)
పదో ర్యాంకు – కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైదరాబాద్)
ఇంజినీరింగ్ ర్యాంకులు
ఫస్ట్ ర్యాంక్ – సనపాల అనిరుధ్(విశాఖపట్టణం)
రెండో ర్యాంక్ – మణింధర్ రెడ్డి(గుంటూరు)
మూడవ ర్యాంక్ ఉమేశ్ వరుణ్(నందిగామ)
నాలుగవ ర్యాంకు అభిణిత్ మజేటి(హైదరాబాద్)
ఐదవ ర్యాంకు ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి)
ఆరవ ర్యాంకు – మారదన ధీరజ్(విశాఖపట్టణం)
ఏడవ ర్యాంకు – వడ్డే శాన్విత(నల్లగొండ)
ఎనిమిదవ ర్యాంకు – బోయిన సంజన(శ్రీకాకుళం)
తొమ్మిదో ర్యాంకు – నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల)
పదవ ర్యాంకు – మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం)
బాలికలే టాప్
RELATED ARTICLES