ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర సిపిఐ(ఎం) అనుసరించిన పొత్తు ల ఎత్తుగడల తీరును సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బిఎల్‌ఎఫ్) పేరుతో ఏర్పాటైన కూటమి అభ్యర్థులను కులం ఆధారంగా ప్రచారం చేయడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇది పార్టీ మూల సిద్ధాంతమైన వర్గ పోరాటం నుండి దూరంగా వైదొలగడమేనని స్పష్టం చేసింది. శాసనసభలో సిపిఐ(ఎం) ప్రాతినిధ్యం కోసం ప్రయత్నిస్తున్న దశలో తా ము అధికారంలోకి వస్తామని, బిసిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం వాస్తవ పరిస్థితులకు భిన్నం గా ఉన్నదని తప్పు బట్టిం ది. ఈ నెల 15,16 తేదీలలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. ఈ సమావేశాల్లో ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ అనుసరించిన పొత్తుల విషయంలో కేంద్ర కమిటీ ఘాటైన వ్యాఖ్యలే చేసింది. పార్టీ కాంగ్రెస్ ఆమోదించి న, కేంద్రకమిటీ అక్టోబర్ సమావేశం పునరుద్ఘాటించిన రాజకీయ పంథాను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీ గుర్తుచేసింది. తెలంగాణలో సిపిఐ(ఎం) స్థాపించిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌లో భాగంగా సిపిఐ(ఎం) 26 స్థానాల్లో పోటీ చేసింది. బిఎల్‌ఎఫ్ 119 స్థానాల్లో 107 చోట్ల పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేదు. సిపిఐ(ఎం) కూడా ఒక్క స్థానాన్ని గెలవలేదు. మొత్తం ఓట్లలో 0.43 శాతం ఓట్లు పొందింది. అయితే, ఈ కూటమిని తెరమీదకు తీసుకురావడంలో ప్రధానంగా ఒక అంశాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. అది పార్టీ మౌలిక వైఖరికి ఏమాత్రం సరిపోలదు. మొత్తమ్మీద వెనుకబడిన వర్గానికి(బిసి) చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఫ్రంట్ ప్రకటించింది.
బాటతప్పిన సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ
RELATED ARTICLES