ఎటా: ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా పడి 30 మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆగ్రాకు చెందిన బస్సు గురువారం రాత్రి అవాఘర్ సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు అదుపుతప్పి గుంతలో పడినట్లు అడిషనల్ ఎస్పి సంజయ్‌కుమార్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు, అందులో ఇద్దరు మహిళలతో సహా 15 మందికి పరిస్థితి విషమంగా మారడంతో ఆగ్రా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
బస్సు బోల్తా పడి 30 మందికి గాయాలు
RELATED ARTICLES