నియంత్రణ అవసరం
22 లోపు సమాధానమివ్వండి
కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వంచన,మోసం,ప్రలోభాలద్వారా చేసే బలవంతపు మతమార్పిడులు జాతిభద్రతకు,పౌరుల ప్రాథమిక హక్కులకు,మతస్వేచ్ఛకు ప్రమాదకరంగా మారతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.“దేశంలో మతస్వేచ్ఛ ఉండవచ్చు, కానీ బలవంతపు మతమార్పిడులుమాత్రం మతస్వేచ్ఛకాదు” అని వ్యాఖ్యానించింది. ప్రలోభాలుపెట్టి,మోసపూరిత పద్ధ ల్లో ఒత్తిడిచేసే మార్గాల్లో మతమార్పిడులు జరగడాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన విషయం గా పరిగణించింది. కేంద్ర ప్రభు త్వం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో తనిఖీ చేయాలని,నియంత్రించాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ విధమైన బలవంతపు మతమార్పిడులను ఆపకపోతే సమాజంలో సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తుతాయని,చాలా ప్రమాదం గా మారవచ్చునని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఆదేశించింది. ఈనెల 22లోపు కేంద్ర ప్రభుత్వం తన సమాధానం చెప్పాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. “ఇది చాలా తీవ్ర విషయం, చిత్తశుద్ధితో వీటిని అడ్డుకునే కృషి జరగాలి,లేకపోతే చాలా భవిష్యత్‌లో చాలా సంక్లిష్టమైన సమస్యలు వస్తాయి, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాకు చెప్పమనండి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఈ సమస్యపై చర్చ జరిగిందని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మెహతా న్యాయమూర్తులకు గుర్తు చేశారు. “ఇక్కడ చెండు ప్రభుత్వాలున్నాయి, ఒకటి ఒడిశా ప్రభుత్వం, రెండు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వీటిని తనిఖీ చేయాలి, చాలామంది బాధితులకు ఇది నేరపూరిత చర్య అని తెలియదు, ఆ విషయం తెలియజెప్పాలి,వారికి సహాయం అందించాలి” అని పేర్కొంది. ఇప్పటికే ఈ ఉన్నతన్యాయస్థానం ముందుకు వచ్చిందని, కోర్టు ఈ విలువలను సమర్థించిందని మెహతా గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాలలో బలవంతపు మతమార్పిడులు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని ఆయన కోర్టుకు చెప్పారు. చాలా సందర్భాలలో బాధితులకు ఇది నేరమనే విషయం తెలియడం లేదన్నారు. న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, రాష్ట్రాలకు ఈ విషయంలో తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. దీనిపై సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్రాల సమాధానం కోరింది. బలవంతపు మతమార్పిడులు దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బలవంతపు మతమార్పిడులు జాతి భద్రతకు ముప్పు
RELATED ARTICLES