సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/హుస్నాబాద్/ హైదరాబాద్
బలమున్న చోట వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇందుకోసం సన్నహలు చేస్తున్నామని సిపిఐ జాతీయ కార్యర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపికి హటావో దేశ్‌కి బచావో నినాదంతో దేశ వ్యాప్తంగా 1516 ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి చర్చలు జరుపుతున్నాయని అన్నారు.శాశన సభ ఎన్నికలు దగ్గర పడటంతో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతుందన్నారు.బీఆర్‌ఎస్‌తో పొత్తు విషయమై ఇంకా స్పష్టత రావల్సి ఉందన్నారు. ధరణి పోర్టల్ లోని లోపాలను సవరించాలని ధరణితో పాటు మాన్యూవెల్ రికార్డులను మేయింటేన్ చేయాలన్నారు.సాదాబై నామా భూ సమస్యకు సంబంధించి తోమ్మిది లక్షల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిల్లో
పని చేస్తున్న గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల గురించి మాట్లాడుతూ ఆయన వాఖ్యలు ఏవిధంగా చేసినా 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుండటం సరైనాదేనని నాణ్యమైన విద్యుత్‌ను అందిచాలన్నారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్,రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్,జిల్లా కార్యదరి సభ్యులు వనేస్,సత్యనారాయణ,అక్కన్నపేట,కోహెడ మండలాల కార్యదర్శులు భాస్కర్,గోపి,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఎం కెసిఆర్‌కు లేఖ
సమ్మెలో ఉన్న గ్రామపంచాయతీ ఉద్యోగులను తక్షణమే చర్చలకు ఆహ్వానించి , సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. హుస్నాబాద్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు కలిసి వారి బాధలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాపితంగా 12,760 గ్రామపంచాయతీలలో స్వీపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషయన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్, నర్సరీలు, వైకుంఠదామాలలో ఉద్యోగులు దాదాపు 50వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నారని వివరించారు. మురుగు కాలువలను తమ ప్రాణాలను పణంగా పెట్టి శుభ్రం చేసి ప్రజలను ప్రాణాలను కాపాడుతున్నారని, పంచాయతీ కార్మికుల పని కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర స్థాయిలో గుర్తింపులు, అవార్డులు కూడా వచ్చాయన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు అవుతున్నప్పటికీ గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోవడంతో ఉద్యోగులలో అసంతృప్తి నెలకొన్నదని తెలిపారు. ప్రధానంగా 20,30 సంవత్సరాల నుండి పనులు చేస్తున్న వీరికి ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోవడం, పనికి గుర్తింపు ఇవ్వకపోడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ, ప్రమాద బీమా లాంటి కల్పించకపోవడం వంటి సమస్యల ఉన్నాయన్నారు. వీటి పరిష్కారం కోసం జూలై 6వ తేదీ నుండి సమ్మె బాట పట్టారని తెలిపారు. జిఒ నెంబర్ 51తో మల్టీపర్పస్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఉద్యోగులు అన్ని రకాల పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, దానితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ట్రైజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 19,500గా నిర్ణయించాలని, జిఒ 51ని రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఎంకు రాసిన లేఖలో చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బలమున్నచోట వామపక్షాలుకలిసే పోటీ
RELATED ARTICLES