ప్రజాపక్షం/హైదరాబాద్: మహిళలందరితో కలిసి బతుకమ్మ వేడుకల్లో జరుపుకోవడం ఆనందాన్ని కలిగిస్తోందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం మూడో రోజు ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలు ఉత్సాహంతో ఆడుతూపాడారు. దాదాపు 200కు పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.