రాష్ట్రాలకు పన్ను వాటా తగ్గింపు ఆర్థిక సంఘం నిర్ణయమే
మంత్రి కెటిఆర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం
హైదరాబాద్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రాల పన్ను వాటాను ఆర్థిక మంత్రిత్వ శాఖ తగ్గించలేదని, ఆర్థిక సంఘమే 42 నుండి 41 శాతానికి తగ్గించిందని కేంద్ర ఆర్థిక శాఖ మం త్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గి, రెండు కేంద్ర పాలిత ప్రాం తాలు పెరిగినందునే పన్ను వాటా ఒక్క శాతం తగ్గినట్లు వివరించారు. తెలంగాణకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా జిఎస్‌టితో కలిసిన నష్టానికి పరిహారాన్ని ఇవ్వలేకపోతున్నామని, జిఎస్‌టి కంపెన్సేషన్ సెస్ వసూలు కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యా యం జరిగిందనడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో సామరస్యంగా ఉండే సహకార సమాఖ్య విధానాన్ని మోడీ అవలంబిస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020- బడ్జెట్‌ను వివిధ వర్గాల ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్‌లో ఆమె సమావేశమయ్యారు. అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రాలు అందజేసిన నిధులనే కేంద్రం పంపిణీ చేస్తుందని, అలా కాకుండా రాష్ట్రాలకు కేంద్రం నిధులను ఇచ్చిందనే పదం వినియోగించడంపై ఐటి మంత్రి కెటిఆర్ అభ్యంతరాలు
తెలుపడాన్ని ఆమె తప్పుబట్టారు.కేంద్రం ఇచ్చిందనే పదా న్ని ఉపయోగించడం తప్పుగా భావిస్తే దీనిని తొలగించాల ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించారు. ‘యు గివ్, వీ గివ్’ అనే పదాలు సాధారణంగా ఉపయోగిస్తామని తెలిపారు.కేంద్ర బడ్టెట్‌పై తెలంగాణ ప్రభుత్వ స్పం దన తన దృష్టికి వచ్చిందని, పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనేది సరికాదన్నా రు. పన్ను వసూళ్ల వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా ఉన్నదని, కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ట్రం వాటా అధికంగానే ఉన్నదని తెలిపారు.