ఏళ్ల తరబడి ఇదే దుస్థితి
కాలువ పక్కన నడవాలంటే భయం
బడికి కరెంట్, దారి చూపాలంటున్న విద్యార్థులు
ప్రజాపక్షం / వర్ధన్నపేట వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని రామ్‌దన్ తండాలో పాఠశాలను ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం పాఠశాలకు వెళ్లేకు దారిని ఏర్పాటు చేసేందుకు దారిని ఏర్పాటు చేయడం మర్చిపోయారు. పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఏండా కాలం రాళ్లు రప్పలపై నడిచే పరిస్థితిఉండగా, వానాకాలం వచ్చిందంటే బురదమయమైన బురదలోనే బడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాల నిర్మించినది మొదలుకుని ఇప్పటివరకు ప్రతీ ఏటా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ లేక, బడికి దారి లేక తాము పరిస్థితి దయనీయంగా ఉందని వారు వివరించారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఎస్‌అర్‌ఎస్‌పి కాలువ పక్కనే నడవాలంటే భయంగా వుందని అన్నారు. ఇదిలా ఉండగా బడిచుట్టూ వున్న భూమిని చుట్టు పక్కల వారు అక్రమించుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ, సంబంధిత అధికారులు దృష్టి సారించి బడికి దారి చూపాలని, కరెంట్ వచ్చేందుకు ఇతర సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు.
దారి ఇవల్సిందే : ఎఈ ప్రజ్ఞ
ఎస్‌అర్‌ఎస్ పి కాలువ పక్కనే ఎడమ వైపున 34, కుడివైపున 32 ఫీట్ల భూమి ఉందని, విద్యార్థులు బడికి వెళ్ళడానికి దారి ఇవ్వాలని రైతులకు ఎఈ ప్రజ్ఞ సూచించారు. కాలువ చుట్టుపక్కల రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం కింద డబ్బులు చెల్లించిందని తెలిపారు. దారిని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
బడికి బాట ఏది?
RELATED ARTICLES