పేద రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం, దక్కని రైతుబంధు
ప్రజాపక్షం/ ఖమ్మం : రాష్ట్రంలోని వాస్తవ ఆధీనంలో ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలను అందించింది. భూ పరిమితితో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకు రూ.8వేల చొప్పున రెండు దఫాలుగా గతేడాది రైతులకు అందజేశా రు. సాగు చేసినా, చేయకున్నా ప్రతి ఎకరాకు రైతు బంధు పేరుతో ఆర్థిక సాయం అందించారు. 1970 దశకంలో దేశవ్యాప్తంగా జరిగిన భూ పంపిణీలో భాగంగా రాష్ట్రంలోనూ లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. బంజరు, ఈ-నామ్, దేవాదాయ, నిరూపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను నిరుపేదల కు అరెకరం, ఎకరం చొప్పున పంపిణీ చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలు ఉన్న చోట లక్షలాది రూపాయలు వెచ్చించి నీటి వసతి కల్పించారు. కొన్ని చోట్ల చిన్న చిన్న కుంటలు నిర్మించగా, మరికొన్ని చోట్ల వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేశారు. భూమి అభివృద్ధి పథకం కింద కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. విద్యుత్తు మీటర్లను ఏర్పాటు చేశారు. అనేక దశాబ్దాలుగా అదే భూ మిని నమ్ముకుని లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి పేద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించలేదు. సేద్యం చేయకుండా ఉన్న భూములకు వందల ఎకరాలు గల ఆసాములకు, చివరకు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మలచిన వ్యవసాయ భూములకు కూడా రైతు బం ధును వర్తింపజేస్తున్నారు.కానీ అనేక దశాబ్దాలుగా సా గు చేసుకుంటున్న నిరుపేద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించి తద్వారా రైతుబంధు పథకాన్ని వర్తింపజేయడంలో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు. ఇప్పటికే ప్రభు త్వం పంపిణీ చేసిన భూములు సాగు చేసుకుంటు న్న పేద రైతుల భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించి రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు కోరుతున్నారు.