కోల్‌కతా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు. గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని ఒప్పించారు. ఈడెన్ గార్డెన్ వేదికగా నవంబర్ 22- వరకు టీమిండియా తొలి డే/నైట్ టెస్టులో బంగ్లాతో తలపడుతుందని దాదా ప్రకటించారు. డే/నైట్ టెస్టు గురించి గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ప్రతిపాదించిన కొద్ది సమయంలోనే చారిత్రక టెస్టుకు మార్గం సుగమం కావడం గమనార్హం. మొదట బంగ్లా క్రికెటర్లు గులాబీ బంతి మ్యాచ్‌ను వ్యతిరేకించినా బీసీబీ వారితో నాలుగైదుసార్లు సమావేశమై ఒప్పించింది. ’ఇదొక శుభ పరిణామం. టెస్టు క్రికెట్‌కు ఈ చర్యలు అవసరం. నేను, నా జట్టు దీనికి కట్టుబడి ఉన్నాం. విరాట్‌కు కృతజ్ఞతలు. అతడు డే/నైట్ టెస్టుకు అంగీకరించాడు’ అని గంగూలీ మీడియాకు తెలిపారు. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే దేశంలో ఒలింపిక్ క్రీడలకు ఊపు తీసుకొచ్చిన క్రీడా దిగ్గజాలు అభినవ్ బింద్రా, మేరీ కోమ్, పీవీ సింధుకు సన్మానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక గులాబీ టెస్టు తరహాలో ఈడెన్ గార్డెన్‌లోనూ టీమిండియా గులాబీ బంతితో వార్షిక టెస్టు ఆడాలని దాదా భావిస్తున్నారని తెలిసింది. దులీప్ ట్రోఫీలో గులాబీతో ఆడిన క్రికెటర్లు పాతబడిన తర్వాత బంతి సరిగ్గా కనిపించడం లేదని అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడే వాడే ఎస్‌జీ టెస్టు క్రికెట్ బంతులను కాకుండా కూకాబుర్రా, డ్యూక్స్ వినియోగించే అవకాశం ఉంది.
బంగ్లా కూడా సిద్ధమే
RELATED ARTICLES