తొలి వన్డేలో విండీస్‌పై గెలుపు
ఢాకా: వెస్టిండీస్‌తో ప్రారంభమైన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌కి గురి అయిన వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్‌ను కూడా ఓటమితో ఆరంభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 5 వికెట్లతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ వన్డే సిరీస్‌లో బంగ్లా 1 ఆధిక్యం సాధించింది. 196 పరుగుల విజయం లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఓపెనర్ లిటన్ దాస్ (41; 57 బంతుల్లో 5 ఫోర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. చివర్లో ముస్తాఫికుర్ రహీం (55 నాటౌట్; 70 బంతుల్లో 5 ఫోర్లు), సాకిబుల్ హసన్ (26 బంతుల్లో 30), సౌమ్య సర్కార్ (19), మహ్మూదుల్లా (14 నాటౌట్) రాణించడంతో బంగ్లా దేశ్ 35.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో చేస్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టును బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్, ముర్తుజాలు కట్టడి చేశారు. కరేబియన్ బ్యాట్స్‌మెన్స్‌పై ఎదురుదాడికి దిగిన వీరు వరుసక్రమాల్లో వికెట్లు తీస్తూ పోవడంతో విండీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. షయ్ హోప్ (43), కీమొ పౌల్ (36), రోస్టన్ చేస్ (32), శ్యాముల్స్ (25) పరుగులు చేసిన తమ జట్టును 200 పరుగులను దాటించలేక పోయారు. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, ముర్తజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. హసన్ మిర్జా, సాకిబుల్ రుబేల్ హుస్సేన్ తలొక్క వికెట్ దక్కించుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టిన ముర్తజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బంగ్లాదేశ్ శుభారంభం..
RELATED ARTICLES