న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీలు ఆదివారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో భేటీ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు జరిగన ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన అం శాలపై చర్చించారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, పా ర్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రి యాంకా గాంధీని బంగ్లా ప్రధాని షేక్ హసీనా కౌగిలించుకున్నారు. ఈ కౌగిలింతను ప్రియాంకా వల్లమాలిన అభిమానంతోనే ఇలా కౌగిలించుకున్నానని ఈమె అభివర్ణించారు. బంగ్లాదేశ్ ప్రధాని తో భేటీ అనంతరం ప్రియాంకా గాంధీ ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. “చాలాకాలం నుంచి మిమ్ములను క లవాలని చూస్తున్నాను. “తను నమ్మిన సిద్ధాంతాల కో సం ఆమె చేసిన పోరాటం, చూపిన తెగువ నాకెప్పు డూ స్ఫూర్తిదాయకమే” అని ప్రియాంక ట్వీట్ చేశా రు. 1974 ఆగస్టు 15న షేక్ హసీనా తండ్రి షేక్ ము జీబుర్ రెహ్మాన్ సహా ఆయన భార్య, పిల్లలను సైనిక తిరుగుబాటులో భాగంగా బంగ్లాదేశ్ మిలిటరీ హత్య చేసింది. ఆ సమయంలో హసీనా భర్తతో కలిసి జర్మనీలో ఉండడంతో ఆమె ప్రాణాలు దక్కాయి.
బంగ్లాదేశ్ ప్రధానిని కౌగిలించుకున్న ప్రియాంక
RELATED ARTICLES