7 వికెట్ల తేడాతో రోహిత్ సేన ఘన విజయం
బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా తాజాగా జరిగిన రెండో టెస్టులోనూ టీ మ్‌ఇండియా ఘన విజయం సాధించిం ది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇ న్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేన 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. తొలి రోజు కేవలం 35 ఓవ ర్లే పడగా, వర్షం కారణంగా మ్యాచ్ రెండు రోజుల పాటు రద్దయ్యింది. దీం తో ఫలితం ఎటువైవు వస్తుందో అన్న తరుణంలో బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసి రోహిత్ సేన చెలరేగిపోయింది. దీంతో కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండి యా మూడు వికెట్లను మాత్రమే కోల్పో యి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ (8), ఇక రెండో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (6) విఫలమైనప్పటికీ, ఆ తర్వాత బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29*) అద్భుతంగా రా ణించారు. అయితే మరో మూడు పరుగులు అవసరం అన్న సమయంలో, య శస్వి జైస్వాల్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత రిషభ్ పంత్‌తో (4*) కలిసి కోహ్లీ మరో వికెట్ కూడా పడనీయకుండానే జట్టును గెలిపించా రు. అంతకుముందు జరిగిన రెండో ఇ న్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆ లౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా, అందులో భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ విజయంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను భారత్ గెలిచినట్లు అయింది. యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ ’ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమ్‌ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రాబోయే ఎనిమిది టెస్టుల్లో మరో మూడు గెలిచినా భారత్ టాప్-2లో ఉండి ఫైనల్‌కు చేరడం ఖాయం.