ప్రజాపక్షం/హైదరాబాద్ ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల పాటు వాయువ్యంగా అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయువ్యం నుంచి ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని అంచనా. రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మూడు రోజుల పాటు కురిసే అవకాశం ఉందన్నారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజులు వర్షాలు!
RELATED ARTICLES