కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా మెట్రో
రూట్‌మ్యాప్‌కు ఆదేశించిన సిఎం రేవంత్‌రెడ్డి
అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష
ప్రజాపక్షం / హైదరాబాద్
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పిన సిఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై శనివారం సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్ మ్యాప్‌ను సిఎంకు అధికారులు వివరించారు. రూట్ మ్యాప్‌పై రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. రోడ్, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని సిఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్
అభివృద్ధి చేసేందుకు వీలుగా, కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సిఎం ఆదేశించారు.