రవి దహియా పోరు రజతంతో సరి
క్వార్టర్స్‌లో ఓడిన దీపక్ పునియా
టోక్యో : రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించే సత్తా ఉందని రవి కుమార్ దహియా నుంచి అభిమానులు అసాధారణ ప్రదర్శనను ఆశించినప్పటికీ, చివరికి నిరాశ తప్పలేదు. పురుషుల 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ ఫైనల్‌లోఅతను రష్యాకు చెందిన జొర్ ఉగేవ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రజతంతో సరిపుచ్చాడు. రెండు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న ఉగేవ్ ఫైట్ ప్రారంభం నుంచే రవి దహియాపై ఆధిపత్యాన్ని కనబరిచాడు. అతనిని నిలువరించి, చిత్తు చేసేందుకు రవి దహియా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా 4 తేడాతో అతను ఓడిపోయాడు. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా, ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న రవి దహియా రజత పతకాన్ని సాధించడాన్న ఒక అద్భుతంగా క్రీడాపండితులు అభివర్ణిస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న సుశీల్ కుమార్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈసారి రవి దహియా ద్వారా భారత్‌కు రెజ్లింగ్‌లో రెండో రజతం, మొత్తం మీద నాలుగో పతకం లభించింది. ఇలావుంటే, 86 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో భారక్‌కు నిరాశ తప్పలేదు. కాంస్యం సాధిస్తాడనుకున్న రెజ్లర్ దీపక్ పునియా ప్లే ఆఫ్ పోరులో శాన్ మారియోకు చెందిన రెజ్లర్ మిలెస్ అమినే చేతిలో అతను 2 పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
ఫైనల్‌లో ఓటమి
RELATED ARTICLES