స్మృతి మంధాన పోరాటం వృథా
మెల్‌బోర్న్: ముక్కోణపు సిరీస్ దక్కించుకొని టీ20 ప్రపంచకప్‌నకు ఉత్సాహంతో బరిలోకి దిగాలనుకున్న భారత మహిళా జట్టుకు నిరాశే మిగిలింది. మెల్‌బోర్న్ వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్మృతి మంధాన (66, 37 బంతుల్లో; 12×4) గొప్పగా పోరాడినా ఆమెకి సహకరించే వారు కరవయ్యారు. ఆసీస్ విజయంలో స్పిన్నర్ జోన్సెన్ (5/12) కీలక పాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (71నాటౌట్, 54 బంతుల్లో; 9×4) అర్ధశతకంతో రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. 65 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. హర్మన్‌ప్రీత్ (14)తో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. దీంతో 14 ఓవర్లకు 115/3తో భారత్ విజయం దిశగా సాగుతోంది. అయితే మెగాన్ బౌలింగ్‌లో స్మృతి ఔటవ్వడంతో పరిస్థితి మారిపోయింది. 29 పరుగులకే భారత్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లాండ్ కూడా పాల్గొంది. ఆస్ట్రేలియా వేదికగా మహిళా ప్రపంచకప్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. భారత్‌సఆసీస్ మ్యాచ్‌తోనే మెగాటోర్నీ ఆరంభం కానుంది.
ఫైనల్లో భారత్ బోర్లా
RELATED ARTICLES