HomeNewsBreaking Newsఫేస్‌బుక్‌ పరేషాన్‌

ఫేస్‌బుక్‌ పరేషాన్‌

నకిలీ ఖాతాలతో డబ్బులు కాజేస్తున్న హ్యాకర్స్‌
టెక్నాలజీని వాడుకుంటున్న మోసగాళ్లు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : భద్రాచలం ఏజెన్సీలో పలుకుబడి కలిగిన మనిషి. ఎక్కడ ఉన్న తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ప్రస్తు తం నా పరిస్థితి బాగా లేదని ఆర్థిక సాయం అందించండి అంటూ ఫేస్‌బుక్‌ సాక్షిగా వేడుకున్నాడు. ఆర్థిక సాయం అందిస్తే కొలుకున్న తర్వాత రుణం తీరుస్తానంటూ అర్థించడం తో పరిచయం ఉన్న చాలా మంది స్పందించారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఖాతాకు చిన్న మొ త్తాలైన ఎక్కువ మంది నగదు బదిలీ చేశారు. బాగా పరిచయం ఉన్న కొందరు ఆరోగ్యం గురించి తెలుసుకుందామని ఫోన్‌ చేస్తే నాకు అనారోగ్యం లేదు, డబ్బు అవసరం లేదంటూ ఆ వ్యక్తి నుంచి సమాధానం రావడంతో అం దరూ అవాక్కయ్యారు. ఆర్థిక సాయం అం దించిన వారితో పాటు అసలు వ్యక్తి ఆరా తీస్తే ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేసి మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభం సందర్భంగా మనమిచ్చే సమాచారాన్ని మొత్తం హ్యాక్‌ చేస్తున్నారు. అసలు ఖాతాదారుని డేటాతో పాటు ఫ్రొఫెల్‌ పిక్చర్‌ సహా మొత్తం సేకరించి కొత్త ఫేస్‌బుక్‌ ఖాతాను సృష్టించి స్నేహితులను ఆహ్వానిస్తున్నారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్‌బుక్‌ స్నేహాన్ని కోరుతుండడంతో చాలా మంది స్నేహితులయ్యారు. స్నేహితుల సంఖ్య కాస్త పెరగగానే అనారోగ్యం, ఆర్థిక సాయం అంటూ పోస్టింగ్‌లు పెట్టి డబ్బు గుంజుతున్నారు. వీరిని పట్టుకోవడం అంత తేలికైన పనిగా కన్పించడం లేదు, ఒకరు ఇద్దరు ఎక్కడో ఒకచోట మోసానికి గురయ్యారనుకుంటే పొరపాటే. నిత్యం హ్యాకింగ్‌ ద్వారా ధనార్జనే ధ్యేయంగా జీవించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏడాది క్రితమే ఫేస్‌బుక్‌ సిఇఒ చెప్పినట్లు 50 మిలియన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు సమాచారం. మారిన పరిస్థితుల్లో ప్రతి సమాచారాన్ని ఫోన్‌లో నిక్షిప్తం చేయడం అందరికీ అలవాటుగా మారింది. విలువైన సమాచారం ఫోన్‌లో నిక్షిప్తం చేస్తే అందుబాటులో ఉండడంతో పాటు పదిలంగా ఉంటుందన్న భావన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంక్‌ ఖాతాలు, వ్యాపార లావాదేవీలు సంబంధ బాంధవ్యాలు సహా ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఫోన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్కసారి ఫోన్‌ హ్యాకర్స్‌ చేతికి చిక్కితే మన సమాచారం మొత్తం వారి చేతికి చిక్కుతుంది. మీరు ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు మీకు వచ్చే సమాచారాన్ని, మీ స్క్రీన్‌ పై ఉండే సమాచారాన్ని కూడా తెలుసుకుంటూ నష్టం చేసే పని ప్రారంభిస్తారు. కొందరైతే వ్యక్తిగత జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇటీవల ఓ యువతి ఫోన్‌ హ్యాక్‌ చేసిన యువకుడు ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడడం, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుని వారికి ఫోన్‌ చేసి చెడుగా మాట్లాడడం చేశాడు. చివరకు ఆ యువతి వ్యక్తిగత జీవితానికి తీవ్ర నష్టం వాటిల్లి చివరకు ఆ ఖాతాను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు చాలా మందికి జరిగి ఉంటుంది. ఇక పోలీస్‌ అధికారులు, ప్రముఖుల ఖాతాలను హ్యాక్‌ చేయడం అందరం చూస్తునే ఉన్నాం. ఇటీవల ఖమ్మం నగరానికి చెందిన ఓ పోలీస్‌ అధికారి నా ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారు. దయచేసి ఆ ఫేస్‌బుక్‌ ఖాతాకు ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని సామాజిక మాధ్యమాల సాక్షిగా విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ పెరిగి ప్రపంచం దగ్గరైందని సంతోషించాలో మనకు తెలియకుండానే మన సమాచారం పరుల చేతికి చిక్కుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించే సమయంలో మనమిచ్చే వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచే ఒక ఆప్షన్‌ను ఉపయోగించడం మినహా ఈ హ్యాకర్స్‌ నుంచి రక్షణ పొందడానికి మరో మార్గం ప్రస్తుతానికి లేదంటున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతా ఉండడం కాదు హ్యాకర్స్‌ చేతికి చిక్కకుండా ఉంచుకునేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి రావడం దురదృష్టం పాల్పడినట్లు తెలుస్తుంది. ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభం సందర్భంగా మనమిచ్చే సమాచారాన్ని మొత్తం హ్యాక్‌ చేస్తున్నారు. అసలు ఖాతాదారుని డేటాతో పాటు ఫ్రొఫెల్‌ పిక్చర్‌ సహా మొత్తం సేకరించి కొత్త ఫేస్‌బుక్‌ ఖాతాను సృష్టించి స్నేహితులను ఆహ్వానిస్తున్నారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్‌బుక్‌ స్నేహాన్ని కోరుతుండడంతో చాలా మంది స్నేహితులయ్యారు. స్నేహితుల సంఖ్య కాస్త పెరగగానే అనారోగ్యం, ఆర్థిక సాయం అంటూ పోస్టింగ్‌లు పెట్టి డబ్బు గుంజుతున్నారు. వీరిని పట్టుకోవడం అంత తేలికైన పనిగా కన్పించడం లేదు, ఒకరు ఇద్దరు ఎక్కడో ఒకచోట మోసానికి గురయ్యారనుకుంటే పొరపాటే. నిత్యం హ్యాకింగ్‌ ద్వారా ధనార్జనే ధ్యేయంగా జీవించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏడాది క్రితమే ఫేస్‌బుక్‌ సిఇఒ చెప్పినట్లు 50 మిలియన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు సమాచారం. మారిన పరిస్థితుల్లో ప్రతి సమాచారాన్ని ఫోన్‌లో నిక్షిప్తం చేయడం అందరికీ అలవాటుగా మారింది. విలువైన సమాచారం ఫోన్‌లో నిక్షిప్తం చేస్తే అందుబాటులో ఉండడంతో పాటు పదిలంగా ఉంటుందన్న భావన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంక్‌ ఖాతాలు, వ్యాపార లావాదేవీలు సంబంధ బాంధవ్యాలు సహా ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఫోన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్కసారి ఫోన్‌ హ్యాకర్స్‌ చేతికి చిక్కితే మన సమాచారం మొత్తం వారి చేతికి చిక్కుతుంది. మీరు ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు మీకు వచ్చే సమాచారాన్ని, మీ స్క్రీన్‌ పై ఉండే సమాచారాన్ని కూడా తెలుసుకుంటూ నష్టం చేసే పని ప్రారంభిస్తారు. కొందరైతే వ్యక్తిగత జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇటీవల ఓ యువతి ఫోన్‌ హ్యాక్‌ చేసిన యువకుడు ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడడం, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుని వారికి ఫోన్‌ చేసి చెడుగా మాట్లాడడం చేశాడు. చివరకు ఆ యువతి వ్యక్తిగత జీవితానికి తీవ్ర నష్టం వాటిల్లి చివరకు ఆ ఖాతాను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు చాలా మందికి జరిగి ఉంటుంది. ఇక పోలీస్‌ అధికారులు, ప్రముఖుల ఖాతాలను హ్యాక్‌ చేయడం అందరం చూస్తునే ఉన్నాం. ఇటీవల ఖమ్మం నగరానికి చెందిన ఓ పోలీస్‌ అధికారి నా ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారు. దయచేసి ఆ ఫేస్‌బుక్‌ ఖాతాకు ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని సామాజిక మాధ్యమాల సాక్షిగా విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ పెరిగి ప్రపంచం దగ్గరైందని సంతోషించాలో మనకు తెలియకుండానే మన సమాచారం పరుల చేతికి చిక్కుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించే సమయంలో మనమిచ్చే వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచే ఒక ఆప్షన్‌ను ఉపయోగించడం మినహా ఈ హ్యాకర్స్‌ నుంచి రక్షణ పొందడానికి మరో మార్గం ప్రస్తుతానికి లేదంటున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతా ఉండడం కాదు హ్యాకర్స్‌ చేతికి చిక్కకుండా ఉంచుకునేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి రావడం దురదృష్టం

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments