నేటి నుంచి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్ : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్‌లు హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్నారు. ఈ సీజన్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్న భారత షట్లర్లు మరో పెద్ద సవాల్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ సింధు ఈ ఏడాది తన స్థాయికి తగ్గట్లు ప్రదర్శనలు చేయలేక పోతుంది. వరుస ఓటములతో గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పడుతోంది. గత సంవత్సరం బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు ఈ ఏడాది మాత్రం ఒక్క టైటిల్‌ను సాధించలేక పోయింది. ఇటీవల జరిగిన మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లో నిష్క్రమించిన సింధు.. అంతకుముందు జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లోనే చాపచుట్టేసుకుంది. ఇక ఇప్పుడైన సింగపూర్ ఓపెన్‌లోనైనా ఈ స్టార్ క్రీడకారిణి భారత్‌కు టైటిల్ అందిస్తుందేమో వేచి చూడాలి. మరోవైపు ఈ ఏడాది ఆచితూచి ఆడుతూ పర్వాలేదనిపించిన మరో మహిళా సింగిల్స్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మరోటైటిల్‌పై కన్నేసింది. ఈ సీజన్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన సైనా ఆతర్వాత గాయం కారణంగా కొన్ని టోర్నీలకు దూరమైంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిరాశ పరిచింది. కానీ ఇప్పుడు సింగపూర్ ఓపెన్‌లో తన సత్తా చాటేందుకు మరోసారి సిద్ధమైంది. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సైనాపై అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్నాడు. మలేసియా ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వెళ్లిన శ్రీకాంత్ ఆ టోర్నీలో భారత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దాదాపు 17 నెలల తర్వాత శ్రీకాంత్ క్వార్టర్స్ స్టేజ్‌కు వెళ్లి పాతా ఫామ్‌ను అందుకున్నాడు. ఇక తాజా సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్ విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాడు. 2017లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కిదాంబి గత ఏడాది నుంచి ఆ జోరును ప్రదర్శించలేక పోతున్నాడు. కానీ అతను పుంజకుంటే ప్రత్యర్థులను మట్టి కరిపించడం ఖాయమనే చెప్పాలి. ఈసారైన స్టార్ షట్లర్లు భారత్‌కు టైటిల్ అందిస్తారేమో వేచి చూడాలి.
ఫేవరేట్‌గా సింధు, సైనా

RELATED ARTICLES