నేటి నుంచి ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
జకర్తా: భారత స్టార్ మహిళా షట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్‌లు మంగళవారం నుంచి ప్రారంభంకానున్న ఇండోనేషియా ఓపెన్ బ్యా డ్మింటన్ టోర్నీలో హాట్ ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు. పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ టైటిలే లక్ష్యంగా పోటీకి సిద్ధమ య్యాడు. బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. సెకండ్ సీడెడ్‌గా బరిలోకి దిగుతున్న తెలుగుతేజం పివి సింధుకు కఠినమైన డ్రా ఎదురైంది. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ సింధు తన తొలి రౌండ్‌లోనే చైనా స్టార్ మాజీ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ లి ఝురుయితో తలపడనుంది. గత ఏడాది అద్భుతంగారాణించిన సింధు ఈ ఏడాది తొలి టోర్నమెంట్ ఆడనుంది. ఈ సీజన్ తొలి టోర్నీ మలేషియా ఓపెన్‌లో సింధు పాల్గొనలేదు. 2018లో జరిగిన కామన్వెల్త్, ఏషి యన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ వంటి మెగా టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన సింధు ఆ ఏడాది చివర్లో జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. ఈ సంవత్సరం కూడా మంచి ప్రదర్శనలు చేసి భారత్‌కు మరిన్ని పతకాలు అందిస్తానని సింధు ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక మరో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు సులభమైన డ్రా లభించింది. సైనా తన తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడనుంది. మలేషియా మాస్టర్స్‌లో అద్భుతంగా రాణించిన సైనా సెమీస్‌లో ఓటమి పాలైంది. ఈసారి ఇండొనేషియా మాస్టర్స్‌లో టైటి ల్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. సైనాకు క్వార్టర్స్‌లో జపాన్ సం చలనం యమగూచి తలపడే అవకాశం కనిసిస్తోంది. పురుషుల సిం గిల్స్‌లో కిదాంబి శ్రీకాంతో మరోసారి భారీ అంచనాలతో మెగా టో ర్నీకి సిద్ధమయ్యాడు. 2017లో నాలుగు సూపర్ సిరీస్‌లతో చెలరేగిన తెలుగు అబ్బాయి కిదాంబి.. 2018లో మాత్రం పేలవమైన ప్రదర్శ నలతో నిరాశ పరిచాడు. మరోవైపు గాయాలు కూడా ఇతనికి వెంటా డాయి. అందుకే గత ఏడాది ఎక్కువ టోర్నీలు కూడా ఆడలేక పోయా డు. కానీ ఈసారి కిదాంబి శ్రీకాంత్ అన్ని విధాలుగా సిద్ధమయ్యాడు. గాయాలను అధిగమించి పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఈ సీజన్ తొలి టోర్నీ మలేషియా మాస్టర్స్‌లో వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చిన శ్రీకాంత్ తర్వాత ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ఇండోనేషియా మాస్టర్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పోటీలకు రెడీ అయ్యాడు. 8వ సీడ్‌గా బరిలోకి దిగుతున్న భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ తన తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన చాంగ్ వి ఫెంగ్‌తో ఢీ కొననున్నాడు. మరోవైపు పురుషుల సిం గిల్స్‌లో హెచ్ ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, సాయి ప్రణిత్, పారుపల్లి క శ్యప్‌లు బరిలో దిగుతున్నారు. సాయి ప్రణిత్, కశ్యప్‌లకు కఠిన మైన డ్రాలు ఎదురయ్యాయి. సాయి ప్రణిత్ తన మొదటి రౌండ్‌లో చైనా స్టార్ నాలుగో సీడ్ చెన్ లాంగ్‌తో పోటీ పడనున్నాడు. పారుపల్లి కశ్య ప్ మొదటి రౌండ్‌లో ఏడో సీడ్ అంథోనీ సినిసుక గింటింగ్ (ఇం డొనేషియా)తో తలపడనున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకీ రెడ్డి చిరాగ్ శెట్టి జోడీ, భారత్‌కే చెందిన మరో జోడీ మను అత్రి సుమిత్ రెడ్డిలతో తలపడనున్నాయి. మహిళల వి భాగం డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప సిక్కి రెడ్డి జంట, మిక్స్‌డ్ డబు ల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ అశ్విని పొన్నప్ప ద్వయం, ప్రణమ్ జెర్రి చోప్రా సిక్కిరెడ్డి జోడీలు భారత్ తరఫున బరిలో దిగనున్నాయి.
ఫేవరెట్లుగా సింధు, సైనా
RELATED ARTICLES