నాదల్, కెర్బర్ కూడా..
ముర్రేకు షాక్.. తొలి రౌండ్‌లోనే విజ్నేష్ ఇంటికీ..
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ
మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్టార్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, వోజ్నియాకీ, కెర్బర్, సిలిక్, అండర్సన్ శుభారంభం చేశా రు. మరోవైపు గ్రేట్ బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేకు తొలి రౌం డ్‌లోనే షాక్ తగిలింది. భారత యువ ఆటగాడు ప్రజ్నేష్ కూడా తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టాడు. సోమవా రం ఇక్కడ ప్రారంభమైన గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో స్విస్ స్టార్ డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ బోణీ కొట్టాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 6 6 6 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 99వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్‌ను వరుస సెట్లలో చిత్తు చేసి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడును కనబర్చిన ఫెదరర్ ప్రత్యర్థిపై పూర్తి ఆధి పత్యం చెలాయించాడు. తొలి సెట్‌ను 6 సునాయా సంగా గెలుచుకున్న ఫెదరర్‌కు రెండో సెట్‌లో ఇస్టోమిన్ నుంచి పోటీ ఎదురైంది. దీంతో ఈ సెట్ హోరాహోరీగా సాగింది. అయితే చివర్లో ఫెదరర్ దూకుడును మరింతగా పెంచి రెండో సెట్‌ను 6 నెగ్గాడు. ఇక చివరి సెట్ కూడా హోరాహోరీగా జరిగిన ఫెదరర్ అనుభవం ముందు ఇస్టోమిన్ నిలవలేక పోయాడు. దీంతో ఫెదరర్ 6 ఆఖరి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నా డు. పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో రెండో సీడ్ స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ 6- 6 7 ఆస్ట్రేలి యా ఆటగాడు జేమ్స్ డక్‌వొర్త్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తొలి రెండు సెట్లు ఈజీగా గెలుచుకున్న నాదల్‌కు చివరి రౌండ్లో డక్‌వొర్త్ నుంచి పోటీ ఎదురైంది. కానీ చివర్లో దూకుడును కనబర్చిన నాదల్ రెండు పాయింట్ల తేడాతో ఆఖరి సెట్‌తో పాటూ మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. మరో మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఐదో సీడ్ కేవిన్ ఆండర్సన్ 6 5 6 6 ఆడ్రియన్ మన్నరినో (ఫాన్స్)ను ఓడించి తర్వాతి రౌండ్‌లో దూసుకెళ్లాడు.
ఆండీ ముర్రే ఔట్..
గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్న గ్రేట్ బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌం డ్‌లోనే వైదొలిగాడు. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత అంత ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ముందే ప్రక టించాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆండీ ముర్రే 4 4 7 7 2 22వ సీడ్ స్టెయిన్ ఆటగాడు రొబెర్టో బౌటిస్టా అగాట్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచుల్లో ఆరో సీడ్ మారిన్ సిలిక్ (క్రోయేషియా) 6 6 7 బెర్నర్డ్ టొమిక్ (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ స్టెఫనస్ సిట్స్‌సిపాస్ (గ్రీస్) 6 6
6 7 తేడాతో మాటెరొ బెరెటిని (ఇటలీ)పై, 20వ సీడ్ గ్రీగర్ డిమిట్రోవ్ (బల్గేరియా) 4 6 6 6 జాన్కొ టిప్సరెవిక్ (సెర్బియా)పై నెగ్గి రెండో రౌండ్‌లో ప్రవేశించారు.
ప్రజ్నేష్ పరాజయం..
క్వాలిఫాయింగ్ రౌండ్లలో సత్తా చాటి మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత ఆటగాడు ప్రజ్నేష్ గుణేశ్వరన్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రజ్నేష్ (భారత్) 6 3 3 తేడాతో ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా) చేతిలో ఓటమిని చవిచూసాడు. తొలి సెట్‌లో దూకుడును ప్రదర్శించిన ప్రజ్నేష్ ఆ తర్వాతి సెట్లలో తేలిపోయాడు. మొదటి సారి గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో చోటు దక్కించుకున్న ప్రజ్నేష్‌కు నిరాశే మిగిలింది.
రెండో రౌండ్లో వోజ్నియాకీ, కెర్బర్..
మహిళల విభాగం సింగిల్స్‌లో టాప్ సీడ్‌లు శుభారంభం చేశారు. డిఫెండింగ్ చాంపియన్, డెన్మార్క్ సంచలనం కారిలోనా వోజ్నియాకీ మహిళల తొలి రౌండ్ మ్యాచ్‌లో 6 6 బెల్జియంకు చెందిన అలీసన్ వాన్ ఉత్వాంక్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. రెండో సీడ్ అంజెలిక్యూ కెర్బర్ (జర్మనీ) 6 6 పొలొనా హెర్‌కోగ్ (స్లోవేనియా)పై వరుసగ సెట్లలో విజయం సాధించి తర్వాతి రౌండ్‌లో దూసుకెళ్లింది. ఇక రష్యా బ్యూటీ మారియా షరపోవా కూడా అద్భుతమైన విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో షరపోవా 6 6 యూకేకి చెందిన హరియెట్ డార్ట్‌ను వరుససెట్లలో చిత్తు చేసి తన సత్తా చాటుకుంది. మహిళల విభాగం ఇతర మ్యాచుల్లో అమెరికా స్టార్ ఐదో సీడ్ స్లోనె స్టెఫెన్స్ 6 6 అమెరికాకే చెందిన టేలర్ టోన్‌సెండ్‌ను, 8వ సీడ్ పెట్రా క్విటొవా (చెక్ రిపబ్లిక్) 6 6 మగ్దలేనా రిబరికోవా (స్లోవేకియా)ను, నెదర్లాండ్స్ స్టార్ 9వ సీడ్ కీకీ బెర్టన్స్ 6 6 అలీసన్ రిస్కే (అమెరికా)ను, 11వ సీడ్ అర్యనా సబలెంకా (బెలారస్) 6 6 అన్న కాలిన్‌స్కయా (రష్యా)ను, చైనాకు చెందిన యాఫన్ వాంగ్ 6 6 అలెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా)లను ఓడించి రెండో రౌండ్‌లో దూసుకెళ్లారు.
ఫెదరర్, వోజ్నియాకీ శుభారంభం
RELATED ARTICLES