క్వార్టర్ ఫైనల్లో దిమిత్రోవ్ చేతిలో ఓటమి
సెమీస్‌లో సెరీనా, స్వీటోలినా
యుఎస్ ఓపెన్-2019
న్యూయార్క్: యుఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం, 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత రోజర్ ఫెదరర్‌కు ఊహించని షాక్ తగిలింది. మరోసారి టైటిల్ సాధించి రికార్డు సృష్టించాలనుకున్న మూడో సీడ్ రోజర్ ఫెదరర్ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో 6–3,4—6,6—3,4—6, 2–6 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో యూఎస్ ఓపెన్ గ్రా్‌ండ స్లామ్ టోర్నీ నుంచి ఫెదరర్ నిష్క్రమించాడు. మూడు గంటల 12 నిముషాలు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌ను 6—3తో ఫెదరర్ సునాయాసంగా గెలిచాడు. అయితే పుంజుకున్న దిమిత్రోవ్ 4-6తో రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫెదరర్ తన అనుభవాన్ని ఉపయోగించి 6-3తో మూడో సెట్ గెలిచి ముందంజ వేసాడు. మళ్లీ దూసుకొచ్చిన డిమిట్రోవ్ 4– నాలుగో సెట్ గెలిచి సమం చేశాడు. ఇక నిర్ణయాత్మక పోరులో దిమిత్రోవ్ ఆదినుంచే చెలరేగి 2–6తో సునాయాస విజయాన్ని అందుకున్నాడు. 78వ ర్యాంకు కలిగిన డిమిట్రోవ్ మూడో సీడ్ ఫెదరర్‌కు షాకివ్వడం విశేషం. శుక్రవారం జరిగే సెమీస్‌లో రష్యా ఐదవ సీడ్ మెద్వెదేవ్‌తో డిమిత్రోవ్ తలపడనున్నాడు. ’మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో ఉన్నానని ఎప్పటికప్పుడు నాకు నేను అనుకున్నా. శారీరకంగా నేను చాలా బాగున్నా. ఫెదరర్‌పై కొన్ని షాట్లు ఆడటం కష్టం అయింది’ అని డిమిట్రోవ్ తెలిపాడు. యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టాప్ సీడ్ల పోరు ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. బెలిండా బెన్‌కిక్ (స్విట్జర్లాండ చేతిలో మహిళల సింగిల్స్ టాప్ సీడ్ నవోమీ ఒసాకా (జపాన్) పరాజయం పాలవ్వగా.. గాయం కారణంగా వావ్రింకా (స్విట్జర్లాండతో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వైదొలిగి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన స్పెయిన్ వీరుడు రఫెల్ నాదల్ క్వార్టర్స్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో విజయం సాధించిన ఐదో సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్) సెమీస్‌కు దూసుకెళ్లింది.
మహిళల సింగిల్స్‌లో..
ఇటీవలె జరగిన ఓ టోర్నిలో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన సెరీనా విలియమ్స్ యుఎస్ ఓపెన్‌లో చెలరేగి ఆడుతున్నారు. వరుస గెలుపులతో సెమీస్‌లో అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణి క్యూ వాంగ్‌తో తలపడి గెలుపొందింది. ఆట మొదటి నుంచే అద్భుతమైన షాట్లతో వాంగ్‌కు అవకాశం ఇవ్వకుండా 6-1, 6-0తో గేమ్‌ను స్ధానం చేసుకుంది. మొదటి సెట్‌లో వాంగ్ నుంచి సెరీనాకు కొంత ప్రతిఘటన ఎదురైనా ఎటువంటి అదురులేకుండా సెట్‌ను 6-1తో గెలుపొంది. రెండో సెట్‌లో చైనా క్రీడాకారిణి నుంచి ఎటువంటి సమాదానమే లేదు. కనీసం పాయింట్ల ఖాతాను కూడా తెరవలేదు. దీంతో సెరీనా 6-0తో రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. మరో కార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్వీటోలినా(ఉక్రెయిన్), జోన్నా కొంటా(యునైటెడ్ కింగ్‌డాం)ల మధ్య జరగ్గా ఈ మ్యాచ్‌లో ప్వీటోలినా చెమటోడ్డి విజయం సాధించింది. వరుసగా రెండు సెట్లలో 6-4, 6-4తో గెలుపొంది సెమీస్‌లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో స్వీటోలినా కొంటా ఆటలను సాగనివ్వలేదు. తెలివైన షాట్లతో గ్రౌండ్ మొత్తం పరుగులు పెట్టించి కొంటాను మట్టికరిపించింది. కాగా, స్వీలోలినా శుక్రవారం జరుగబోయే మ్యాచ్‌లో సెరీనా విలియమ్స్‌తో తలపడనుంది.
38 ఏళ్ల వయసులో..
38 వయసులో యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తిగా బిల్ లార్నెడ్ నిలిచాడు. బిల్ లార్నెడ్ 38 ఏళ్ల 8 నెలల 3 రోజుల వయసులో కూడా టెన్నిస్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. అది కూడా 1911లో కావడం విశేషం. కాగా, ప్రస్తుతం ఫెదరర్ వయసు 39 ఏళ్లు. ఇప్పటికే రోజర్ 20 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకుని అరుదైన రికార్డులో ఉన్నాడు. ఈ యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సైతం గెలుపచుకొని మరో రికార్డును సృష్టించాలనుకున్న ఫెదరర్ ఆశలకు దిమిత్రోవ్ కళ్లెం వేశాడు
చివరగా 2018లో గ్రాండ్ స్లామ్ టైటిల్
రోజర్ ఫెదరర్ చివరగా 2018లో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫెదరర్ ఆట మధ్యలో వీపు నొప్పికి ట్రీట్‌మెంట్ కోసం విరామం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మంగళవారం ఆర్థర్ ఆషే స్టేడియంలో ఐదు సెట్లపాటు కొనసాగినా క్వార్టర్ ఫైనల్ ్యచ్‌లో రోజర్ ఫెదరర్‌పై దిమిత్రోవ్ 3-6, 6-4, 3-6, 6–4, 6-2 తేడాతో విజయం సాధించాడు. దీంతో దిమిత్రోవ్ 28 ఏళ్ల అనంతరం యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన బల్గేరియా ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
ఫెదరర్‌కు షాక్
RELATED ARTICLES