ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో/ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలను ఆదివారం పూజారులు ప్రకటించారు. గద్దెల ప్రాంగణంలో సమ్మక్క-సారలమ్మల పూజారులు సమావేశమై తేదీలను నిర్ణయిం చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల రాక, ఫిబ్రవరి 6న సమ్మక్క, ఫిబ్రవరి 7న భక్తుల మొక్కులు, 8న వనదేవతల వనప్రవేశం చేయనున్నట్లు పూజారుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షులు చంద గోపాల్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో పూజారులు సిద్ధబోయిన మునేందర్, కొక్కెర క్రిష్ణయ్య, సారలమ్మ పూజారులు కాకసాయ్య సిద్ధబోయిన అరుణ్‌కుమార్, కాక కిరణ్, సిద్ధబోయిన సమ్మయ్య, కాక వెంకటేశ్వర్లు, సిద్ధబోయిన నర్సింగరావు, ఎస్.భోజారావు, గోవర్దన్, బుచ్చిరాములు, సమ్మారావు, సమ్మయ్య పూజారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర
RELATED ARTICLES