ప్రజాపక్షం/గోదావరిఖని : ప్రజాపక్షం దిన పత్రిక ఆధ్వర్యంలో అనాధ, వృద్ధుల ఆశ్రమం లో మాస్క్ లను పంపిణి చేయడం జరిగింది. దేశాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ ని ధరి చేరకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త లో భాగంగా ప్రజాపక్షం పత్రిక తరపున గోదావరిఖని ఇంచార్జి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో లో ఆదివారం సీనియర్ పాత్రికేయుల చేతుల మీదుగా గోదావరిఖని లో ఉన్న అన్ని అనాధ, వృద్ధుల ఆశ్రమం లోని వృద్ధులకు, అనాధ పిల్లలకు వాషెబుల్ మాస్క్ లను పంపిణి చేయడం జరిగింది. అనంతరం పాత్రికేయులు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు చేతులను కడుక్కోవాలని , ఒకరికి ఒకరు సామజిక దూరాన్ని పాటించడం వలన కరోనా వైరస్ ని అరికట్టే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రమ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రాంగా ఉంచుకోవాలని సూచించారు,ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీకాంత్, సీపెల్లి రాజేశం, రంగు రాజయ్య,కెనడి,శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్, మున్నా, రవి పుసాల, నరసింహ (నాని),నాగరాజు,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.