HomeNewsLatest Newsప్రొ॥ సాయిబాబాకు అంతిమ వీడ్కోలు

ప్రొ॥ సాయిబాబాకు అంతిమ వీడ్కోలు

ప్రజాపక్షం/మేడ్చల్‌/మల్కాజిగిరి/హైదరాబాద్‌
అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా అణచి వేతల ధోరణికి జీవితాంతం పోరాడుతూ సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా విడుదలై అనారోగ్యం తుది శ్వాస విడిచిన పోరాట యోధుడు ప్రొఫెసర్‌ సాయిబాబాకు వేలాదిగా తరలి వచ్చిన పౌరహక్కుల నేతలు, వామపక్ష నాయకులు, రాజకీయ నేతలు, శ్రే యోభిలాషులు, అభిమానులు సోమవారం హూరూశునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన నివాసం నుం డి ప్రారంభమైన అంతిమ యాత్ర డప్పు చప్పుళ్లు, పాటలు, నినాదాలతో కొనసాగింది. కామ్రేడ్‌ సాయిబాబా అమర్‌ రహే, లాల్‌ సలామ్‌, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ పౌరహక్కుల నేతలు హోరెత్తించే ర్యాలీ కొనసాగింది. అక్రమ నిర్బంధంతో రాజ్యమే సాయిబాబాను చంపిందని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. మౌలాలిలోని ఆయన నివాసంలో సాయిబా పార్థివ దేహానికి రాజకీయ నేతలు, అభిమానులు నివాళులర్పించిన అనంతరం ఆయన కోరిక మేరకు పా ర్థివ దేహాన్ని ఊరేగింపుగా గాంధీ వైద్యకళాశాల వరకు తీసుకొని వెళ్లి అక్కడి వైద్యులకు అప్పగించారు. ఇప్పటి ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి కుటుంబ సభ్యులు అప్పగించారు.
నిమ్స్‌ నుండి గన్‌పార్కు మీదుగా… నివాసానికి
అనారోగ్యంతో గత శనివారం తుది శ్వాస విడిచిన సాయిబాబా పార్థివదేహాన్ని సోమవారం ఉదయం ఆ యన కుటుంబ సభ్యులు తీసుకొని గన్‌పార్కు మీదుగా మౌలాలిలోని ఆయన నివాసానికి తీసుకొని వచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎన్‌.మల్లేష్‌, విఎస్‌ బోస్‌, నేతలు దశరథ్‌, ఈటి నరసింహ, సహదేవ్‌, జంగ య్య, నిమ్మల నర్సింహ, రవి, రవీంద్రచారి, కృష్ణ, సిపి ఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, రాష్ట్ర సమితి సభ్యులు ఉమా మహేష్‌, స్టాలిన్‌, అనిల్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు కాంపల్లి శ్రీనివాస్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్‌, సత్యప్రసాద్‌ తదితరులు ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. సాయిబాబా మృతి అత్యంత బాధాకరమని, నిర్దోషిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజులకే ఆయన తుది శ్వాస విడిచి పెట్టి వెళ్లి పోవటం శోఛనీయమని, దశాబ్ద కాలంగా ఆయనతో పా కుటుంబ సభ్యులు అనుభవించిన బాధ వర్ణనాతీతమని ఎన్‌.మల్లేష్‌, విఎస్‌ బోస్‌లు తెలిపారు. ఎమ్మె కోదండరామ్‌, మాజీ మంత్రి కెటి రామారావు, హరీష్‌రావు, ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, కాలేరు వెంకటేష్‌, సుమన్‌, మాజీ ఎంపి మధు యాష్కీ గౌడ్‌, కార్పొరేటర్‌ జెరిపోతుల ప్రభుదాస్‌, ప్రముఖ పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ తదితరులు ప్రొఫెసర్‌ సాయిబాబాకు ఘనంగా నివాళులర్పించారు. సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని, ఆయ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్‌ చేసారు. రాజ్యాంగ మౌలిక హక్కుల కోసం సాయిబాబా పోరాడారని, ప్రజాస్వామ్యవాదులంతా ఆయన అక్రమ నిర్భందాన్ని వ్యతిరేకించారని ఆయన అన్నారు. దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్‌ సాయిబాబా మరణం తీరని లోటని, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. పార్థివదేహాన్ని సందర్శించి 90% వైకల్యం ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలు ఉన్నా బెయిల్‌ ఇవ్వకుండా కుట్రకు సాయిబాబా బలయ్యారని, చివరికి ఆయన తల్లి అంత్యక్రియలకు సైతం హాజరు కాకుండా పెరోల్‌ సైతం పొందలేక పోయారన్నారు. సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి నిర్దోషిగా బయటకు వచ్చి కొద్ది రోజులకే సాయిబాబా మృతి చెందటం బాధాకరమని, ఆయనతోటు ఆయన కుటుంబీకులు పడిన వేతనకు ఎవరు బాధ్యులని మాజీ మంత్రి హరీష్‌రావు నిలదీసారు. తన శరీరాన్ని గాంధీ వైద్యకళాశాలకు అప్పగించాలని ఆయన కోరుకోవటం ఆదర్శనీయమన్నారు.
బిఆర్‌ఎస్‌ నేతలకు నిరసన సెగలు
ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహాన్ని సందర్శించటానికి వచ్చిన మాజీ మంత్రి కెటిఆర్‌తో సహా బిఆర్‌ఎస్‌ నేతలకు నిరసన సెగ ఎదురైంది. కెటిఆర్‌ గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

గన్‌పార్క్‌ వద్ద సాయిబాబా అభిమానులు,పోలీసులకు మద్య వాగ్వాదం
సాయిబాబా భౌతికకాయాన్ని నిమ్స్‌ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్దకు తరలించారు. సంతాప సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే సంతాప సభకు హాజరయ్యేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌.కె. నారాయణ,జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌.బాలమల్లేష్‌, సహా వామప పార్టీల నాయకులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు.ఈ సందర్భంగా “సాయిబాబా అమర్‌ రహే..లాల్‌ సలాం, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ” పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం గన్‌పార్క్‌ వద్ద 5 నిమిషాల పాటు సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు పోలీసులను కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. సాయిబాబా భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి సభను నిర్వహిస్తామని వారు చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సాయిబాబా భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోనే పెట్టి పలువురు నివాళ్లు అర్పించారు. అనంతరం ‘సాయిబాబా ఆశయాలను “కొనసాగిస్తాం,..జోహార్‌ సాయిబాబా జోహార్‌ జోహార్‌ ’ అని వారు అమరవీరుల స్తూపం వద్ద పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతం సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన సోదరి నివాసానికి తరలించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments