యువతి గొంతు కోసి చంపిన ఉన్మాది
హన్మకొండలో దారుణం
ప్రజాపక్షం/వరంగల్‌బ్యూరో; ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో దిశపై హత్యాచారం చేసిన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. మహిళలపై అకృత్యాలను ఆపేందుకు నిర్భయ లాంటి చట్టాలను తీసుకువచ్చిన ఏ మాత్రం భయపడడం లేదు. తాజాగా హన్మకొండలోని లష్కర్ సింగారంకు చెందిన మునిగాల హారతి అనే యువతిని కాజీపేటకు చెందిన ఎండి. షాహిద్ అనే యువకుడు శుక్రవారం సాయత్రం నమ్మించి గొంతు కోసి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హన్మకొండ రాంనగర్‌లో ప్రేమ పేరుతో యువతిని తన గదికి రమ్మని చెప్పిన షాహిద్ ఆ యువతి గొంతు కోసి పరారయ్యాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాజీపేటలోని చైతన్యపురి కాలనీలో రజాక్ మటన్ షాప్‌లో పనిచేస్తున్న మహమ్మద్ షాహిద్, మృతురాలు హారతి ఇద్దరూ ప్రేమికులనీ, హన్మకొండ హంటర్‌రోడ్డులోని మాస్టర్‌జీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కాగా ఆ యువతి ఇటీవల మరొకరితో సన్నిహితంగా ఉందనే అనుమానంతో బ్లేడుతో గొంతు కోసి నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతిపై దాడి అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. రాంనగర్‌లోని ఘటనాస్థలిని వరంగల్ సిపి రవీందర్ పరిశీలించారు. అదుపులోకి తీసుకున్న షాహిద్ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మధ్యాహ్నం