HomeNewsBreaking Newsప్రేమే నేరమా?

ప్రేమే నేరమా?

అగ్రకుల యువతిని ప్రేమించిన గిరిజన అడ్వకేట్‌
ఆదివారం అదృశ్యం… సాగర్‌ కాల్వలో శవమై తేలిన వైనం

ప్రజాపక్షం/ సూర్యాపేటప్రతినిధి సూర్యాపేట పట్టణంలో పరువు హత్య జరిగింది. అగ్ర కుల యువతిని ప్రేమించిన ఓ గిరిజన యువ అడ్వకేట్‌ నిఖిల్‌ (24) ఆదివారం అదృశ్యమై మంగళవారం సాగర్‌ కాల్వలో శవమై తేలాడు. కుటుంబసభ్యులు, బంధువులు పరువు హత్య అని ఆరోపిస్తున్నారు. అగ్ర కులానికి చెందిన ఓ యువతి అతడిని ప్రేమించగా ఆమె తండ్రి ఈ హత్య చేశాడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న మాజీ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ నాయకులు ధరావత్‌ భాస్కర్‌కు కుమారై, కుమారుడు ఉన్నారు. కుమారుడు నిఖిల్‌ ఇటీవల ఎల్‌ఎల్‌బి పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఇతను దసరా సెలవుల్లో స్వస్ధలానికి రావడం జరిగింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం తన స్నేహితుడి బర్తడే ఉందంటూ రాత్రి 7గంటలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. రాత్రి 11.30గంటలకు తన తల్లి సంధ్యకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నాను కంగారు పడకండి అంటూ చెప్పాడు. ఆ తర్వాత ఎంతకి ఇంటికి రాకపోవడంతో తిరిగి ఫోన్‌ చేయగా అతడి సెల్‌ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌గా ఉంది. మరుసటి రోజు ఉదయం తమ కుమారుడు కనిపించడం లేదని సూర్యాపేట పట్టణ పోలీసుస్టేషన్‌ తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని కట్టకొమ్ముగూడెం సమీపంలో సాగర్‌ కాల్వలో శవమై తేలాడు. కాల్వలో మృతదేహాన్ని చూసిన స్ధానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెలికి తీసి పోస్టుమార్టన్‌ నిమిత్తం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుప్రతి మార్చరికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
తమ కుమారుడిది పరువు హత్య : తల్లిదండ్రుల ఆరోపణ
తమ కుమారుడిది పరువు హత్య అంటూ నిఖిల్‌ తల్లిదండ్రులు భాస్కర్‌, సంద్య ఆరోపిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు నిఖిల్‌ ఇటీవల కాలంలో సూర్యాపేట పట్టణంలోని అంజలి స్కూల్‌ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఓ వడ్డీ వ్యాపారి కుమా రై తరుచు ఫోన్‌ చేసి మాట్లాడుతుండగా ప్రేమ వ్యవహారం తెలిసిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన తాము ఆ యువతితో అనేక మార్లు తమ కుమారుడిని వదిలిపెట్టమని మీకు, మాకు తగదని ఫోన్‌లో చెప్పినట్లు మృతుడి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అయిన తమ కుమారుడిని వదిలిపెట్ట కుండా తమ ఇంటి వద్దకు కారు వేసుకొని వచ్చి నాతో వస్తావా…
రావా అంటూ వేధింపులకు గురి చేసి తీసుకొని వెళ్లేందని బోరున విలపిస్తూ చెప్పారు. తమది న్యాయవాదుల కుటుంబమైన మాకు అన్యాయం జరిగిందని వాపోయ్యారు. ప్రేమించిన యువతి
ఆగ్ర కులం (వైశ్య) కావడంతోనే ఆమె తండ్రితో పాటు తన కుమారుడు తనను వదలాలి అంటూ దూరం పెట్టుకుంటూ వస్తుండడంతోనే ఇరువురు కలిసి ఈ హత్య చేయించారంటూ ఆరోపించారు. పోలీసులు సమగ్రంగా విచారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments