మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్టార్ ఆటగాళ్లు జొకోవిచ్, సెరెనా విలియమ్స్, హాలెప్, నిషికోరి, జ్వెరెవ్‌లో ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించారు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 6 6 4 6 తేడాతో డెనీస్ షపవాలొవ్ (కెనడా)పై విజయం సాధించి రౌండ్ దూసుకెళ్లాడు. ఈ ఆరంభం నుంచి దూకుడుగా ఆడి తొలి రెండు సెట్‌లు సునాయాసంగా గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మూడో సెట్‌లో మాత్రం తడబడ్డాడు. ప్రత్యర్థి చేతిలో మూడు సెట్‌ను కోల్పోయిన జొకో తర్వాతి సెట్‌లో 6 ఘన విజయం సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ జర్మనీ స్టార్ అలెక్సాండర్ జ్వెరెవ్ 6 6 6 ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ బొల్ట్‌ను వరుస సెట్లలో చిత్తు చేసి నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. మరో మ్యాచ్‌లో జపాన్ సంచలనం ఎనిమిదో సీడ్ కీ నిషికోరి 7 6 6 జోవ్ సౌస (పోర్చుగల్)ను ఓడించి తర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టాడు.
వీనస్‌కు షాక్..
మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్ వన్ వీనస్ విలియమ్స్‌కు షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సిమోనా హాలెప్ (రొమానియా) 6 6 తేడాతో అమెరికా స్టార్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌ను వరుస సెట్లలో ఓడించి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో జపాన్ యువ సంచలనం నాలుగో సీడ్ నౌమి ఒసాకా 5 6 6 సు వీ హెష (చైనీస్ థైపీ)పై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన ఒసాకా తర్వాతి సెట్‌లలో వరుస విజయాలు సాధించి నాలుగో రౌండ్‌కు అర్హత సాధించింది.
సెరెనా జోరు..
అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. ఇక్కడ జరిగిన మూడో రౌండ్ పోటీలో 16వ సీడ్ సెరెనా (అమెరికా) 6 6 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన డయానా యస్ట్రెమ్‌స్కాను వరుస సెట్లలో ఓడించి ముందంజ వేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సెరెనా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తనదైన మార్కు షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి సునాయాసంగా గెలుపొందింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకరైన సెరెనా విలియమ్స్ మరో అడుగు ముందుకేకింది. కొద్ది కాలం టెన్నిస్‌కు దూరంగా ఉన్న సెరెనా ఈసారి పాతా జోరును కనబర్చుతూ ఆకట్టుకొంటుంది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ కారొలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్) 64, 3 6 27వ సీడ్ కమిలా గియోర్గి (ఇటలీ)పై నెగ్గింది. ఆరో సీడ్ ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్విటొలినా 4 6 7 షుయ్ జాంగ్ (చైనా)పై చెమటోడ్చి నెగ్గింది. స్పెయిన్ స్టార్ గార్బెన్ ముగురుజ 7 6 స్విట్జర్లాండ్‌కు చెందిన టిమియా బక్‌సిన్జ్‌కీను ఓడించి ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది.
పేస్ జోడీ శుభారంభం..
భారత స్టార్ లియాండర్ పేస్ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగం తొలి రౌండ్‌లో గెలచి శుభారంభం చేశాడు. శనివారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్), సమంతా స్టొసర్ (ఆస్ట్రేలియా) జోడీ 6 7 తేడాతో కెటా పెస్చ్‌కె (చెక్ రిపబ్లిక్), వెస్లే కూల్హొఫ్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. హోరాహోరీగా జరిగిన పోరులో చివరి వరకు గట్టిగా పోరాడిన పేస్ జోడీకి విజయం దక్కింది.
ప్రీ క్వార్టర్స్‌లో జొకోవిచ్, సెరెనా
RELATED ARTICLES