HomeNewsBreaking Newsప్రాణాలు పోయినా భూములు వదులుకోం

ప్రాణాలు పోయినా భూములు వదులుకోం

కోయపోషగూడెంలో మళ్లీ గుడిసెలు వేసిన పోడు రైతులు
ప్రజాపక్షం/ దండేపల్లి/ మంచిర్యాల

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెం పోడు భూముల ఆందోళన ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తూనే ఉంది. మూడు రోజులుగా అటవీ, పోలీస్‌ అధికారులకు, ఆదివాసీ, గిరిజన రైతులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అరెస్ట్‌లు, దాడులు, ప్రతి దాడులతో గిరిజన గూడెంలో పరిస్థితి రోజు రోజు కు ఆందోళనకరంగా మారుతోంది. పోడు భూములను సాగు చేసుకునేందుకు అందులో ఆదివాసీ, గిరిజన రైతులు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాటిని ఖాళీ చేయించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురు, శుక్ర వారాల్లో అధికారు లు, ఆదివాసీలకు మధ్య జరిగిన పోడు భూ ముల పోరులో అనేక మంది గిరిజన, ఆదివాసీ మహిళలు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగిలిన వారిని అరెస్ట్‌ చేసి స్థానిక ఎంఆర్‌ఒ ముందు బైండోవర్‌ చేసి విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, శుక్రవారం రాత్రికి రాత్రే పోడు రైతులు తిరిగి అదే స్థానంలో తాత్కాలిక గుడిసెలు నిర్మించడంతో అటవీ, పోలీస్‌ అధికారులు శనివారం ఉదయం మళ్లీ గిరిజన గూడాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేది లేదని, ప్రాణాలు పోయిన భూములు వదిలి ఇక్కడ నుండి కదిలేది లేదని పోడు రైతులు స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా పోడు వ్యవసాయం నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు వేరే జీవనాధారం లేదని, ప్రభుత్వం, అధికారులు తమ ప్రాణాలు తీసినా ఈ భూముల్లోనే ప్రాణాలు వదులుతాం తప్ప భూములు వదులకోమని భీష్మించి చెబుతున్నారు. పోడు రైతుల భూపోరాటానికి స్థానిక అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం, వారికి తోడుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఆదివాసీ, గిరిజన పోడు రైతుల భూ పోరాటానికి మరింత బలాన్ని చేకుర్చింది. మరోవైపు శుక్రవారం గిరిజన మహిళలపై జరిగిన దాడిని రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని కమిషన్‌ చైర్మన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గిరిజన గూడెంలో జరిగిన సంఘటనపై సమగ్ర నివేదిక అందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments