కర్ణాటక చామరాజనగన్ ఆసుపత్రిలో 24 మంది మృతి
బెంగళూరు: కరోనా కారణంగా దేశ వ్యాప్తం గా ఆక్సిజన్ కొరత తీవ్రమై, ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఢిల్లీ సర్ గంగారాం ఆసుపత్రిలో 25 మంది, గోల్డెన్ జై పూర హాస్పిటల్‌లో 20 మంది ఆక్సిజన్ లభ్యం కాక మృతి చెందిన సంఘటనను మరువక ముందే కర్నాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందకపోవడంతో 24 మంది రోగుల ప్రాణాలు గాల్లో కలిశాయి. రోగుల బంధువులు, సన్నిహితుల రోదనలతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, తమ వారు మరణించడానికి ఇదే ప్రధాన కారణమని ఆరోపిస్తున్న మృతుల బంధువులు నిరసనలకు దిగారు. మరణించిన వారంతా ఆక్సిజన్ మీద చికిత్స పొందుతున్నవారే. మృతుల్లో 23 మంది కొవిడ్ రోగులున్నారు. కాగా, చామరాజనగర్ జిల్లా ఇన్‌చార్జి, కర్నాటక ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఎస్. సురేష్ కుమార్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే, ఆక్సిజన్ కొరత కారణంగానే అందరూ మృతి చెందారనడంలో నిజం లేదని ఒక ప్రకటనలో అన్నారు. కొంటమంది వెంటిలేర్‌పై ఉన్న రోగులు కూడా మృతుల్లో ఉన్నట్టు ఆయన చెప్పారు. అంతేగాక, వారంతా ఒక్క రోజులోనే మరణించలేదని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చోటు చేసుకున్న మరణాలని వివరించారు. నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 గంటల మధ్యలో ఆకిజన్ లభ్యత లేదని సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో 6,000 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఒ) అందుబాటులో ఉందని, అయితే, సిలిండర్లు అవసరమవుతాయని అన్నారు. అవి మైసూరు నుంచి రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి వివరాఉ అందచేసినట్టు చెప్పారు. ఇలావుంటే, జిల్లా డిప్యూటి కమిషనర్‌తో ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప ఫోన్‌ను మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.
మంత్రి రాజీనామాకు రాహుల్ డిమాండ్
చామరాజనగన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 24 మంది మృతి చెందిన సంఘటనపై కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశాడు. ‘రోగులు మృతి చెందారా? లేక చంపబడ్డారా? మృతుల్లో 23 మంది కొవిడ్ బాధితులు ఉన్నారన్న సమాచారం విన్న తర్వాత నా ద్రవించిపోయింది. ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం విఫలమవుతున్నాయి. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ప్రాణాలు తీస్తున్న ‘ఆక్సిజన్’!
RELATED ARTICLES