అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ
మరో ఐదు రోజులు భారీగా వర్షాలు
ప్రజాపక్షం / హైదరాబాద్
రాష్ట్రంలో ఇటీవల కాలంగా తరుచూ ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిండు కుండలను తలపిస్తున్నాయి.ప్రతి రోజు సాయంత్రం ఐదు చాలు వర్షంతో ఇటు రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలు తడి ము ద్దవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల నీ టి మట్టాలు గరిష్టానికి చేరకుంటున్నాయి. ము ఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేని వర్షాలు, ఎగువ కర్నాటక నుంచి వస్తోన్న వరదలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిమట్టం స్థాయి గరిష్టానికి చేరుకుంది. భద్రచాలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో ఇప్పటికే మొద టి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు జారీ చేశారు. అంతే కాకుండా ప్రాజెక్టు గరిష్టానికి చేరకున్నాయంటూ లోతట్టు ప్రాం ప్రజలను అప్రమత్తం చేస్తు వస్తున్నారు. ఎగు వ నుండి వస్తున్న వరద పోటుతో గోదావరి ఉధృ అంతకంతకు పెరుగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్.. మానేరు, కిన్నెరసాని, తుపాకులగూడెం సమ్మక్క సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 31.8 మీటర్ల నీటి మట్టం ఉంది. ఈ స్పిల్ వే దిగువన 20.6 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాపర్ డ్యామ్ ఎగువన 30.30 మీటర్ల నీటి మట్టం ఉండగా, దిగువన 20.15 మీటర్లు ఉంది. ఇక పోలవరం నుంచి 8,16,838 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇరిగేషన్ వర్గా వెల్లడించాయి. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారే జ్ దగ్గర వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. దీం తో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. తెలంగాణలో వానలు-వదరలతో కృష్ణా నది పరవళ్లు తొ క్కుతుండడం, మొన్న కర్నాటక రాష్ట్రంలో తుంగభద్ర డ్యాం గేటు వరదకు కొట్టుకు పోవడంతో అధికారులు సాగునీటి రంగ ప్రాజెక్టుల గేట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూరాల, తుంగభద్ర , నాగార్జునసాగర్ , శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తుండడంతో వీలైనంత వరకు నీటికి కిందికి వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీల్లో ఇన్ ఫ్లో అంతకంతకు పెరుగుతోంది. ఇటు ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతోంది. కాళేశ్వరంపై ఇరిగేషన్ శాఖ నిఘా కాగా నీటి ప్రవాహాల విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నా గానీ.. ఇటీవల రాజకీయ పార్టీల నాయకులు మేడిగడ్డ బ్యారేజీని, గోదావరి ఉధృతిని పరిశీలించి రావడం గమనార్హం. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే విపక్షాలు యత్నిస్తున్నాయంటూ ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా ఇరిగేషన్ శాఖ వర్గాల చర్యలతో ఇటు కాళేశ్వరం పుష్కర ఘాట్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు మూసీ నది సైతం ఓ స్థాయిలో ఉధృతంగానే ప్రవహిస్తోంది . ఇక హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ , ఉస్మాన్ సాగర్ కూడా నిండుకోవడంతో నీటిని కిందికి వదులుతున్నారు.
హైదరాబాద్ తాగునీటికి ఇక ఢోకా లేనట్టే.. :ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఈ ఏడాది ఎండా కాలంలో ఎండల తాకిడికి హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నగరానికి ప్రధానంగా తాగు నీరు అందించే జంట జలశాయాలు.. గండిపేట, హిమాయత్ సాగర్‌లోనూ నీరు డెడ్ లెవల్ స్టోరేజీకి చేరుకుంటున్న క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డి డైరెక్టుగా రంగంలోకి దిగి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. నగరంలో తాగునీటి కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చూస్తున్నామని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ “ ప్రజాపక్షం”కు తెలిపారు. ప్రాజెక్టుల్లో నీరు నిండుకోవడంతో ఇక నుంచి నీటి గురించి టెన్షన్ అక్కరలేదని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లలోకి ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. మరికొద్ది రోజుల్లోనే నగరవాసులకు నీరు అందించే రిజర్వాయర్లు పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ జలశయాలు ఇప్పటికే జలకళను సంతరించుకుంటున్నాయని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాలైన సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లకు భారీగా వరదనీరు వస్తుండటంతో నీటి కష్టాలకు చెక్ పడనుందని అన్నారు.