ప్రజాపక్షం / హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి ముగిసేనాటికి రాష్ట్ర అప్పు లు రూ.2.40 లక్షల కోట్లకు చేరుకోనున్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3 లక్షలు కోట్లకు చేరవకానుంది. శాసనసభలో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ వివరాలు సభ ముందుంచారు. సవరించిన అంచ నా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 1,99,215.30 కోట్లకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వ పూచీకత్తుపై మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టులు, డబుల్ బెడ్‌రూమ్ తదితరాల తీసుకున్న రుణం రూ. 40,241.32 కోట్లు అవుతుంది. ఈ రెండు కలిపితే 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పు రూ. 2,39,456.62 కోట్లకు చేరుతుంది. అయితే, 2020 బడ్జెట్‌లో ప్రభుత్వం వివిధ మార్గాల నుండి తీసుకున్న రుణం రూ. 2,29,205.16 కోట్లకు చేరుకుంటుంది. దీనికి అదనంగా ప్రభుత్వ పూచీకత్తు పై తీసుకున్న రూ. 40వేల కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సుమారు రూ. 18వేల కోట్లు, ఇతర ప్రాజెక్టులకు అటూ ఇటుగా మరో రూ.10వేల కోట్ల వరకు అప్పు తీసుకు నే అవకాశం ఉన్నది. ఇవన్నీ కలిపితే ప్రభు త్వ రుణం రూ.3లక్షల కోట్లకు చేరువకానుంది.2020 సంవ్సతరంలో వివిధ వనరుల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకునే అప్పు రూ.2.29 లక్షల కోట్లు లో బహిరంగ మార్కెట్‌లో అత్యధికంగా రూ.1.87 కోట్ల రు ణం ఉండనుం ది. ఆ తరువాత చిన్న మొత్తాల పొదుపు, పిఎఫ్ తదితర ప్రత్యేక సెక్యూరిటీ నిధుల నుండి రూ.19వేల కోట్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల నుండి రూ.14వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి రూ.8,682 కోట్లు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రుణగ్రస్థంగా ఉండబోతుంది. ఇదిలా ఉండగా మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులకు ప్రభుత్వ పూచీకత్తుపై తీసుకున్న రుణ బకాయిని 2019- బడ్జెట్‌లో రూ.73,314 కోట్లు చూపించగా, 2020 బడ్జెట్‌లో కేవలం రూ.40,241 కోట్లుగానే చూపించారు.
ప్రస్తుత రాష్ట్ర అప్పు రూ. 2.40 లక్షల కోట్లు
RELATED ARTICLES