ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌కు ప్రొఫెసర్లు ఫిర్యాదు
ప్రజాపక్షం/హైదరాబాద్: ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను ప్రొఫెసర్లు కలిశారు. ఉస్మానియా, గాం ధీ, నిలోఫర్ ఆసుపత్రుల ఎస్‌సి, ఎస్‌టి ప్రొఫెసర్లు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పాటించడం లేదని చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అర్హులున్నా వివక్ష పాటిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. ప్రమోషన్లలో న్యాయం చేయాలని విన్నవించారు. చైర్మన్‌ను కలిసిన వారిలో ఎస్‌సి, ఎస్‌టి ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు, డిప్యూటి సివిల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ, ఎయిడ్స్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డా. అన్న ప్రసన్న, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్, నిలోఫర్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, అసోసియేట్ ప్రాఫెసర్ డాక్టర్ సుధారాణి, రాష్ట్ర వైద్యవిధాన పరిషద్ కార్యదర్శి డాక్టర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ప్రమోషన్లలో రిజర్వేషన్లు పాటించడం లేదు
RELATED ARTICLES