భారత్‌లో కరోనా మృతులు 2,109
అంతకంతకూ పెరుగుతున్న బాధితులు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంగా రోజుకు మూడువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, వందకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 3277 కేసులు నమోదయ్యాయి. 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 62,939గా నమోదైంది. కరో నా బాధితుల్లో ఇప్పటివరకు 19,358 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 30.75గా ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. కా గా, కరోనా నిర్ధారణ పరీక్షల వివరాలను కూడా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతిరోజు 95 వేల నిర్ధార ణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఇప్పటి వరకూ దాదాపు 1.5 కోట్ల పరీక్షలు జరిగాయని తెలిపిం ది. దేశ వ్యాప్తంగా 332 ప్రభుత్వ ఆస్పత్రులు, 121 ప్రై వేటు ల్యాబ్‌లలో ఈ పరిక్షలు జరుగుతున్నాయంది. ‘ఇతర దేశాల స్థాయిలో భారత్ పరిస్థితి దిగజారుతుందని అనుకోవట్లేదు. అయితే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి హర్షవర్ధన్ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అత్యధిక కరోనా కేసులు నమోదైన తొలి పది రాష్ట్రాలపై కేంద్రం దృష్టి సారించిందని, కేంద్ర బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయన్నారు.
మహారాష్ట్రలో 779, గుజరాత్లో 472 మరణాలు..
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉం ది. రోజుకు కొత్తగా వెయ్యి కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,228కి చేరగా 779మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కొవిడ్- తీవ్రత కలవరపెడుతోంది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 12వేలు దాటగా పుణెలో 2,700కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత అత్యధిక తీవ్రత గుజరాత్లో ఉంది. అంతేకాకుండా గు జరాత్, మధ్యప్రదేశ్‌లలో మరణాల రేటు కలవరపెడుతోంది. గుజరాత్లో ఇప్పటివరకు మొత్తం 7796 కేసు లు నమోదు కాగా 472మంది మృత్యువాతపడ్డారు. మ ధ్యప్రదేశ్లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రం లో మొత్తం 3614 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 215మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్ల్లీలో వైరస్ బారినపడినవారి సంఖ్య 6542కి చేరగా 73మంది మరణించారు. తమిళనాడు లో వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6535కి చేరగా 44మంది ప్రా ణాలు కోల్పోయా రు. పశ్చిమ బెంగాల్లోనూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రా ష్ట్రంలో 171 మంది మృత్యువాతపడగా మొత్తం 1786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకిన ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 100దాటింది. ఇక్కడ 3708 కేసులు నమోదుకాగా 106 మంది మరణించారు.
ప్రమాద ఘంటికలు
RELATED ARTICLES