జాతీయ రహదారిగా గుర్తిస్తేనే నివారణ సాధ్యం!
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాజీవ్ రహదారి.. హైదరాబాద్ నుండి వయా కరీంనగర్ మీదుగా రామగుండం వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలో నిత్యం వేళల్లో వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి. సరుకు రవాణాకు ఉపయోగించే లారీలు, ద్విచక్రవాహనాలు మొదలుకొని కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు వెళ్లాల్సిన వేగం కంటే కూడా అధిక వేగంగా వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదాలకు ప్రధాన కారణం మావన తప్పి దం ఒకటి కాగా, మరోటి మలుపుల రహదారులు రెండో కార ణం. ఈ వంకర టింకర మార్గాల్లో ఇప్పుడు ఎదో ఒక చోట నిత్యం రోడ్డ ప్రమాదాల కారణంగా రక్తమోడుతోంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగి రోజు వారీ కూలీ పనలు చేసుకునేందుకు వచ్చే కూలీలు మేడ్చల్‌కు వచ్చే క్రమంలో లారీ ఢీకొని మృత్యువాత పడ్డారు. మూలమలుపులు ఎక్కువగా ఉండడం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించినా ఆ రహదారిలోని లోపాలను నివారించడంలో ఆర్ అండ్ బి శాఖ విఫలమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న రహదారులను విస్తరిస్తూ అభివృద్ధి పరుస్తున్నారని, ఆఖరుకు పంచాయతీరాజ్ రోడ్లను విస్తరించి అభివృద్ధి పరుస్తున్నారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు ఎన్‌హెచ్ 44లో షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ నుండి దామరచర్ల వరకు వయా చేగూర్ పంచాయతీరాజ్ రోడ్డును రూ.14కోట్లతో డబుల్ లైన్ గా విస్తరించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డబుల్ లైన్ రోడ్డు కోసం అందిన ప్రతిపాదనల మేరకు పంచాయతీరాజ్‌శాఖ ఈ రోడ్డుకు ఆమోదం తెలియజేస్తూ ఈ నెల 18నే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోడ్డే కాదు, రాష్ట్రంలో ఇలాంటి పలు రహదారులను అభివృద్ధి చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే ప్రమాదాలకు ఆలవాలంగా ఉంటున్న వంకర్లు, మూలమలుపులను సరి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నా రు. ప్రస్తుత రాష్ట్ర రహదారిగానే ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి పరచాలని ప్రజా ప్రతినిధులు, ఎంపిలు ఇలా పలువురు చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెట్టిందని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై ఎన్‌హచ్‌ఎఐ వర్గాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వినతిమాత్రమే వచ్చిందని, రోడ్డు విస్తరణకు, భూసేకరణ తదితరాలకు కానున్న వ్యయంలోనూ కానున్న ఖర్చులను భరించేందుకూ సంసిద్ధతను వ్యక్తం చేస్తే బాగుంటుందని ఎన్‌హెచ్‌ఐఎ వర్గాలు చెబుతున్నాయి.